త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | న‌వంబ‌ర్ 6న ‘రామాయణ’ విడుద‌ల

Ramayana | 'రామాయణ'.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

S

Entertainment | Published On Aug 6, 2026, 5.08 pm IST

Ramayana | న‌వంబ‌ర్ 6న ‘రామాయణ’ విడుద‌ల
Advertisement

Ramayana | త్రినేత్ర‌.న్యూస్ : 'రామాయణ'.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న య‌ష్‌, సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది న‌వంబ‌ర్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు సోనీ పిక్చ‌ర్స్ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంగ్లీష్ డ‌బ్బింగ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. సుమారు రూ. 1400 నుండి రూ. 1500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రామాయ‌ణ‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ రాముడిగా, య‌శ్ రావ‌ణుడిగా, సాయిప‌ల్ల‌వి సీతగా, స‌న్నీ డియోల్ హ‌నుమాన్‌గా, ర‌వి దూబే ల‌క్ష్మ‌ణుడిగా న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement