త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | విజువ‌ల్ వండ‌ర్ రామాయ‌ణ ట్రైల‌ర్.. మీరూ చూసేయండి

Ramayana | భార‌తీయ ఇతిహాసాల్లో రామాయ‌ణానికి (Ramayanam)అగ్ర‌స్థానం ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా, మ‌రెన్నిసార్లు దృశ్య‌రూపకంలో చూసినా కొత్త‌గానే ఉంటుంది. సీతారామ చ‌రిత్ర‌ను సినీ ద‌ర్శ‌కులు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను జోడించి ఒక్కొక్క‌రు ఒక్కోవిధంగా చెబుతూ ఉంటారు.

G

Entertainment | Published On Jul 30, 2026, 6.47 am IST

Ramayana | విజువ‌ల్ వండ‌ర్ రామాయ‌ణ ట్రైల‌ర్.. మీరూ చూసేయండి
Advertisement

Ramayana | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌తీయ ఇతిహాసాల్లో రామాయ‌ణానికి (Ramayanam)అగ్ర‌స్థానం ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా, మ‌రెన్నిసార్లు దృశ్య‌రూపకంలో చూసినా కొత్త‌గానే ఉంటుంది. సీతారామ చ‌రిత్ర‌ను సినీ ద‌ర్శ‌కులు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను జోడించి ఒక్కొక్క‌రు ఒక్కోవిధంగా చెబుతూ ఉంటారు. అలా వ‌చ్చిన ప్ర‌తి సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే (కొన్ని మిన‌హా) ఉన్నారు.

తాజాగా దంగ‌ల్ ఫేమ్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) ద‌ర్శ‌క‌త్వంలో భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో `రామాయ‌ణ‌` (Ramayana) తెర‌కెక్కుతున్న‌ది. సుమారు రూ.4000 కోట్ల‌తో ప్రైమ్ ఫోక‌స్ స్టూడియోస్ అధినేత‌ న‌మిత్ మ‌ల్హోత్రా (Namit Malhotra) నిర్మాణంలో ఈ పౌరాణిక మ‌హాకావ్యం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న‌ది. ర‌ణ్‌బీర్ క‌పూర్ రాముడిగా, సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) సీత‌గా, య‌శ్ రావ‌ణుడిగా, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడిగా ఈ సినిమాలో న‌టిస్తున్నారు. మొద‌టి భాగాన్ని ఈ ఏడాది దీపావ‌ళికి (నవంబర్ 8, 2026 న), రెండో భాగాన్ని వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం (Part 1) కి సంబంధించిన ట్రైలర్‌ను (Ramayana Trailer) బ్రహ్మముహూర్తాన (Brahma Muhurt) మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

Advertisement
Advertisement