త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mangli | రూ.10 కోట్లు మోసం.. సింగ‌ర్ మంగ్లీపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు న‌మోదు

Mangli | ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లీ (Mangli) మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. త‌న‌ను రూ.10 కోట్లు మోసం చేశార‌ని, మంగ్లీతోపాటు ఆమె సోద‌రుడి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

G

Entertainment | Published On Apr 11, 2026, 9.27 am IST

Mangli | రూ.10 కోట్లు మోసం.. సింగ‌ర్ మంగ్లీపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు న‌మోదు
Advertisement

Mangli | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లీ (Mangli) మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. త‌న‌ను రూ.10 కోట్లు మోసం చేశార‌ని, మంగ్లీతోపాటు ఆమె సోద‌రుడి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు వారిద్ద‌రితోపాటు మ‌రో ముగ్గురిపై బీఎన్ఎస్ సెక్ష‌న్ 351(2), 352 కింది కేసులు న‌మోదుచేశారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

కాగా, ఓ సినిమాలో బూతు పాట పాడ‌టంతో ఆమెపై ముంబైకి చెందిన లాయ‌ర్ వినీత్ జిందాల్ కేంద్ర స‌మాచార మంత్రిత్వ శాఖ‌కి ఫిర్యాదు చేశారు. క‌న్న‌డ హీరో ధ్రువ స‌ర్జా న‌టించిన పాన్ ఇండియా మూవీ కేడీ: ది డెవిల్ (KD: The Devil)లో స‌ర్కే చున‌ర్ (Sarke Chunar) అనే పాట హిందీ వ‌ర్ష‌న్‌ని మంగ్లీ పాడారు. అయితే శృంగారాన్ని వ‌ర్ణిస్తూ వాడిన ప‌ద‌జాలం అత్యంత అస‌భ్య‌క‌రంగా, ద్వందార్థాల‌తో ఉంద‌ని, సాహిత్యం, దృశ్యాలు స‌మాజంపై ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతాయ‌ని త‌న ఫిర్యాదులో వినీత్ జిందాల్‌ పేర్కొన్నారు.

ఇక గ‌తేడాది జూన్ 11న అనుమతి లేకుండా చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో బర్త్‌డే వేడుక‌లు జ‌రుపుకోవ‌డంతో పోలీసులు మంగ్లీపై కేసు న‌మోదుచేసిన విష‌యం తెలిసిందే. ఎలాంటి అనుమతులూ లేకుండా పుట్టిన రోజు పార్టీ నిర్వహించడం, మద్యం సరఫరా చేయడం, గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడడంతో మంగ్లీ సహా నలుగురిపై కేసు ఫైల్ చేశారు.

Advertisement
Advertisement