Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్‌పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కార్తి సర్ధార్ 2 సినిమాకు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ధురంధర్ స్ఫూర్తి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కంపేరిజన్స్‌పై కార్తి రియాక్ట్ అయ్యాడు. ధురంధర్‌తో సర్ధార్ 2కు ఎలాంటి పోలికలు ఉండవని అన్నారు. జానర్ ఒకటే తప్పితే కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్లు వేరుగా ఉంటాయని తెలిపారు.
Entertainment | Published On Sep 5, 2026, 6.28 pm IST
కార్తి సర్ధార్ 2 కు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ధురంధర్ స్ఫూర్తి అంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సర్ధార్ 2 కథ, కార్తి క్యారెక్టర్ ధురంధర్‌కు దగ్గరగా ఉంటాయని అంటున్నారు. ఈ కంపేరిజన్స్‌పై హీరో కార్తి రియాక్ట్ అయ్యాడు. ధురంధర్, సర్ధార్ 2... రెండు స్పై థ్రిల్లర్ సినిమాలే. జానర్ పరమైన కనెక్షన్ తప్పితే కథ విషయంలో ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు.
కాన్సెప్ట్ వేరు....
ధురంధర్ కాన్సెప్ట్ వేరు. అందులో హీరో ఇండియా నుంచి గూఢచారిగా పాకిస్థాన్ వెళతాడు. అక్కడ ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపడుతాడు. దాదాపుగా గూఢచారి సినిమాలన్నీ విదేశీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంటాయి. రొటీన్ టెంప్లేట్ జానర్‌ను భిన్నంగా ‘సర్దార్ 2’ ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ఇండియాలోనే ఉంటూ ఓ గూఢచారి ఎలా హ్యాండిల్ చేశాడు అన్నదే ఈ మూవీ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్. కాన్సెప్ట్ , విజువల్ పరంగా చాలా హై స్టాండర్డ్స్‌లో సినిమా ఉంటుంది
లార్జ్ స్కేల్...
స్పై థ్రిల్లర్ జానర్‌లో దక్షిణాదిలో కూడా ఇంత గొప్ప స్థాయిలో సినిమా చేయగలమని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఈ సినిమా నిలుస్తుంది . చాలా లార్జ్ స్కేల్‌లో సినిమా చేశాము. ఇందులో బిగినింగ్ నుంచి చివరి వరకు అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ప్లాష్ బ్యాక్ సీన్స్, క్లైమాక్స్ ఫైట్ మైండ్ బ్లోయింగ్ గా ఫీలింగ్‌ను కలిగిస్తాయి .
సర్దార్ 2లో ముగ్గురు హీరోయిన్లు...
సర్దార్ 2లో ముగ్గురు హీరోయిన్లు నటించారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ కోణంలో కాకుండా అవసరమైతే దేశం కోసం అమ్మాయిలు ధైర్యంగా పోరాటం చేయగలరని చూపిస్తూ ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్ క్యారెక్టర్లను దర్శకుడు కొత్తగా చూపించారు.
డ్యూయల్ రోల్...
సర్దార్ 2లో కార్తి డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ పాత్రల గురించి వెల్లడిస్తూ సర్ధార్ 2లో "తండ్రీకొడుకులుగా కనిపిస్తా. తండ్రి క్యారెక్టర్ ఓల్డ్ గెటప్‌తో ఉంటుంది. ఈ పాత్ర కోసం మేకప్ వేసుకోవడం, వయసుకు తగ్గ వేరియేషన్స్ చూపించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది" అని కార్తి పేర్కొన్నారు.
తెలుగు డైరెక్టర్లతో...
అప్‌కమింగ్ మూవీస్ గురించి చెబుతూ... "ప్రస్తుతం తెలుగు దర్శకులు శైలేష్ కొలనుతో హిట్ 4, కళ్యాణ్ శంకర్‌తో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. మార్షల్ షూటింగ్ యాభై శాతం వరకు పూర్తయ్యింది" అని కార్తి చెప్పాడు. అన్న సూర్యతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడంపై కార్తి రియాక్ట్ అయ్యాడు. కలిసి సినిమా చేయాలని ఇద్దరికి ఉంది. మా ఇమేజ్‌లకు కథ, డైరెక్టర్ దొరకడం లేదని అన్నారు.
సర్దార్ మూవీకి సీక్వెల్‌గా సర్దార్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ తమిళ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kollywood | కత్తితో కేక్ కట్ – స్టార్ డైరెక్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై వివాదం
సెప్టెంబర్ 5, 2026

Kayadu Lohar | రాజకీయాలు చేయడం నాకు రాదు – తమిళ సినిమా కాంట్రవర్సీపై కయదు లోహర్ కామెంట్స్
సెప్టెంబర్ 4, 2026

Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ – కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?
- ●Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!
- ●Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ
- ●CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ
- ●Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే
- ●P Muralidhar Rao vs Konda Surekha | "బీజేపీ ఏమైనా చెత్తకుప్పా?".. కొండా సురేఖ చేరిక వార్తలపై మురళీధర్ రావు సంచలన ట్వీట్

Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్కు చుక్కెదురు: అసలు అది 'రమ్' కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?

Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!

Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ

CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ



