Peddi Movie | రామ్‌చరణ్ అభిమానులకు భారీ షాకిచ్చిన పెద్ది టీమ్
బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Entertainment | Published On Apr 15, 2026, 6.37 pm IST
Peddi Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీ ఈ సమ్మర్ వెకేషన్‌లో విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. అంతకుముందు మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత తేదీని ఏప్రిల్ 30కి మార్చారు. తాజాగా మూవీని మళ్లీ వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. మరోసారి వాయిదా వేస్తూ జూన్ 2026 లో విడుదల చేస్తామని మూవీ యూనిట్ స్పష్టం చేసింది.
వాయిదాకి కారణం అదేనా?
సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కానీ ఇంకా ఒక సాంగ్ షూట్ మిగిలి ఉంది. ఆ సాంగ్ షూట్ చేయాలి. మూవీ మొత్తం ఎడిట్ కూడా చేశాం. ఔట్‌పుట్ బాగా వచ్చింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా మూవీని తీర్చిదిద్దడం కోసమే మరోసారి వాయిదా వేస్తున్నాం. టెక్నిషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కి కావాల్సినంత సమయం ఇవ్వడం కోసమే మూవీని జూన్‌లో రిలీజ్ చేస్తున్నాం. తేదీ త్వరలోనే వెల్లడిస్తాం.. అంటూ పెద్ది టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



