Pawan Kalyan Vs Ram Charan | పెద్ది వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ – బాబాయ్ ముందుకు – అబ్బాయ్ వెనక్కి
రామ్‌చరణ్ పెద్ది మూవీ పోస్ట్‌పోన్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ మే లేదా జూన్‌లో విడదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మార్చి 27న పెద్ది ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Jan 23, 2026, 5.06 pm IST
Pawan Kalyan Vs Ram Charan | రామ్‌చరణ్ పెద్ది మూవీ పోస్ట్‌పోన్ కానున్నట్లు గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఈ పాన్ ఇండియన్ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
పోస్ట్‌పోన్ కానుందా...
కాగా పెద్ది మూవీ మార్చి 27న విడుదల కావడం అనుమానమేనంటూ చాలా రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమర్స్‌పై మేకర్స్ మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. పెద్ది షూటింగ్ ఇంకో నాలుగు వారాలకుపైనే బ్యాలెన్స్‌గా ఉందట. ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడానికి రెండు నెలలు వరకు టైమ్ పట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని పోస్ట్‌పోన్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఉస్తాద్ భగత్‌సింగ్...
పెద్ది పోస్ట్‌పోన్‌తో మెగాఫ్యాన్స్ డిసపాయింట్ కాకుండా మేకర్స్ కొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం పెద్ది రిలీజ్ డేట్‌ను కేటాయించినట్లు టాక్. ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఏప్రిల్ నెలాఖరున ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ పెద్ది పోస్ట్‌పోన్‌తో మార్చి 27 స్లాట్ ఖాళీ కావడంతో ఆ డేట్‌కే ఉస్తాద్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. పెద్దితో పాటు ఉస్తాద్ భగత్‌సింగ్ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం కూడా రిలీజ్ డేట్ ఛేంజ్‌కు మార్గం ఈజీ అయ్యిందని వార్తలొస్తున్నాయి.
త్వరలోనే పెద్ది పోస్ట్‌పోన్‌తో పాటు ఉస్తాద్ భగత్‌సింగ్ కొత్త రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. పెద్ది మూవీ మే లేదా జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
పెద్ది మూవీలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్‌కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ఇది.
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | చెల్లిని రిజెక్ట్ చేసి అక్కకు ఛాన్స్ – పెద్ది హీరోయిన్ సెలెక్షన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా!
మే 16, 2026

Ram Charan | పెద్ది ప్రమోషన్స్‌లో చేతికి బ్యాండేజ్‌తో రామ్ చరణ్ – మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
మే 15, 2026

Peddi | ఐపీఎల్ మ్యాచ్‌లో రామ్‌చరణ్ పెద్ది ప్రమోషన్స్ – పాన్ ఇండియన్ లెవెల్లో ఈవెంట్స్…
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



