Sarke Chunar Song Controversy | నాకు కన్నడ రాదు.. హిందీ లిరిక్స్ గురించి తెలియదు : సర్కే చునార్ పాట వివాదంపై నోరా ఫతేహీ
హిందీలో ఈ పాటకు లిరిక్స్ రాసిన రాకీబ్ ఆలం స్పందిస్తూ తనకు ఇష్టం లేకపోయినా దర్శకుడు ప్రేమ్ ఒత్తిడి చేసి కన్నడ సాహిత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అలాగే హిందీలోకి మార్పించాడని చెప్పుకొచ్చాడు.
Entertainment | Published On Mar 18, 2026, 6.49 pm IST
Sarke Chunar Song Controversy | ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన కేడీ ది డెవిల్ మూవీలోని సర్కే చునార్ పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోని పాటను సంజయ్ దత్, నోరా ఫతేహీపై చిత్రీకరించారు. అయితే.. ఆ పాటలో అనుచిత, ద్వందార్ధాలు ఉన్నాయంటూ జాతీయ మానవ హక్కుల సంఘం మూవీ యూనిట్‌కి నోటీసు జారీ చేసింది. సోషల్ మీడియాలోనూ ఈ పాటపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీలో ఈ పాటపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హిందీ వెర్షన్ పాటను సోషల్ మీడియా నుంచి మూవీ యూనిట్ తొలగించింది. ఈ పాటను రకీబ్ ఆలం రాయగా, అర్జున్ జన్య మ్యూజిక్ ఇచ్చాడు. తెలుగు సింగర్ మంగ్లీ ఈ పాటను పాడంది. ఈ పాటలో నటించిన నోరా ఫతేహీ, సంజయ్ దత్‌పై కూడా విమర్శలు రావడంతో తాజాగా నోరా ఫతేహీ స్పందించింది.
సాహిత్యంపై నాకు అవగాహన లేదు
హిందీ వెర్షన్ పాట వివాదంపై స్పందించిన నోరా ఫతేహీ.. హిందీ లిరిక్స్ ఇంత దారుణంగా ఉన్నాయని తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది. తన ఇన్‌స్టా అకౌంట్‌లో బుధవారం ఓ వీడియోను రిలీజ్ చేసింది నోరా. హిందీ వెర్షన్ కోసం తన వీడియోను వాడుకోవడానికి అనుమతి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ పాటను మూడేళ్ల క్రితమే కన్నడలో చిత్రీకరించారని, తనకు కన్నడ తెలియకపోవడంతో మూవీ యూనిట్ చెప్పిన దాన్నే నమ్మినట్లు నోరా వీడియోలో స్పష్టం చేసింది. నాయక్ నహీ ఖల్నాయక్ హుమై అనే క్లాసిక్ సాంగ్ రీమేక్ అంటూ తనను నమ్మించారని నోరా ఆరోపించింది.
ఏఐతో సృష్టించారు
సంజయ్ దత్, తనపై ఉన్న కొన్ని ప్రమోషనల్ ఫోటోలను తన అనుమతి లేకుండానే ఏఐ సాయంతో సృష్టించారని నోరా ఫతేహీ ఆరోపించింది.
మండిపడ్డ ప్రముఖులు
ఈ పాట వివాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. కమర్షియల్ సాంగ్స్‌లోనే ఇది అత్యంత తక్కువ స్థాయి పాట అంటూ ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ మండిపడ్డారు. మద్యం సీసా గురించి వర్ణిస్తున్నట్టు చెబుతూనే, అత్యంత అసభ్యకరమైన అర్థాలు వచ్చేలా ఈ పాట ఉందంటూ పలు ఫిర్యాదులు అందాయి.
ఒత్తిడి చేయడం వల్లనే అలాగే రాశాను
హిందీలో ఈ పాటకు లిరిక్స్ రాసిన రాకీబ్ ఆలం స్పందిస్తూ తనకు ఇష్టం లేకపోయినా దర్శకుడు ప్రేమ్ ఒత్తిడి చేసి కన్నడ సాహిత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అలాగే హిందీలోకి మార్పించాడని చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియా నుంచి ఈ సాంగ్‌ను తొలగించిన తర్వాత త్వరలోనే కొత్త సాహిత్యంతో మరో పాటను విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nora Fatehi | ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో సందడి చేయనున్న డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి..!
మే 9, 2026

Nora Fatehi | బూతు సాంగ్ కాంట్రవర్సీ.. విచారణకు హాజరైన నోరా ఫతేహి.. తప్పుకు ప్రాయశ్చిత్తంగా….
మే 7, 2026

Tamannaah | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో మిల్కీ బ్యూటీ – ఐకానిక్ సాంగ్ కోసం స్టెప్పులు
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



