త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay | హీరో విజ‌య్‌కి మ‌ద్రాసు హైకోర్టులో చుక్కెదురు.. ఆ పిటిష‌న్‌ను కొట్టేసిన న్యాయ‌స్థానం

Vijay | ప్ర‌ముఖ న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గ‌మ్ (TVK) చీఫ్ విజ‌య్ (Vijay)కి మ‌ద్రాసు హైకోర్టులో (Madras High Court) చుక్కెదురైంది.

D

Entertainment | Published On Feb 6, 2026, 12.25 pm IST

Vijay | హీరో విజ‌య్‌కి మ‌ద్రాసు హైకోర్టులో చుక్కెదురు.. ఆ పిటిష‌న్‌ను కొట్టేసిన న్యాయ‌స్థానం
Advertisement

Vijay | ప్ర‌ముఖ న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గ‌మ్ (TVK) చీఫ్ విజ‌య్ (Vijay)కి మ‌ద్రాసు హైకోర్టులో (Madras High Court) చుక్కెదురైంది. ఆదాయపు పన్ను శాఖ విధించిన ట్యాక్స్ పెనాల్టీని రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. రూ.1.5 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు విజ‌య్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

కాగా, 2015 -16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ తన ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించారని ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఆరోపిస్తోంది. అప్పుడు విజ‌య్ ఇంట్లో జ‌రిపిన సోదాల్లో 2015లో వచ్చిన పులి సినిమాకు గానూ విజ‌య్ రూ.15 కోట్లు తీసుకున్న‌ట్లు తేలింది. ఈ సొమ్మును త‌న ఆదాయంలో విజ‌య్ చూపించ‌లేద‌న్న‌ది అధికారుల ఆరోప‌ణ‌. ఇందుకు గానూ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని విజ‌య్‌కి నోటీసులు ఇచ్చారు. దీన్ని స‌వాల్ చేస్తూ 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. విజ‌య్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు గత నెల 23న తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ క్ర‌మంలోనే ఇవాళ విజ‌య్ పిటిష‌న్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువ‌రించారు.

Advertisement
Advertisement