Hero Vishal | జీవితం ఎంత అనిశ్చితమైనది.. ఆర్‌బీ చౌదరి మృతిపై హీరో విశాల్
Hero Vishal | సూపర్ గుడ్ ఫిలింస్ (Super Good Films) బ్యానర్‌పై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి (RB Choudary) మృతిచెందారు. మంగళవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆయన మృతిపై హీరో విశాల్ (Hero Vishal) ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Entertainment | Published On May 6, 2026, 11.09 am IST
Hero Vishal | త్రినేత్ర.న్యూస్: సూపర్ గుడ్ ఫిలింస్ (Super Good Films) బ్యానర్‌పై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి (RB Choudhary) మృతిచెందారు. మంగళవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆయన మృతిపై హీరో విశాల్ (Hero Vishal) ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన నిర్మాత ఆర్‌బీ చౌదరి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. షూటింగ్ మధ్యలో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. మాటలు రావడం లేదు. జీవితం ఎంత అనిశ్చితమైనది. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాతల్లో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జీవా, జిథన్ రమేశ్, సురేశ్, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుంచి కోలుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం విశాల్ హీరోగా దర్శకుడిగా రూపొందిస్తున్న ‘మకుటం’ చిత్రాన్ని ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై 99వ సినిమాగా ఇది తెరకెక్కుతున్నది. ఆయన మరణ వార్త తెలుసుకున్న చిత్ర బృందం సెట్‌లోనే నివాళులు అర్పించింది.
ఆర్‌బీ చౌదరి అసలు పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. రాజస్థానీ కుటుంబానికి చెందిన ఆయన తొలుత ఉక్కు, ఎగుమతులు, నగలు మొదలైన వ్యాపారాలు చేసేవారు. ఆ తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ ద్వారా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 99 సినిమాలను నిర్మించారు. 1990 దశకంలో సక్సెస్‌ఫుల్ సినిమాలకు చిరునామాగా నిలిచారు.
వెంకటేష్, పవన్ కళ్యాణ్..
తెలుగులో అగ్ర హీరోలు వెంకటేష్, పవన్ కళ్యాణ్ మొదలుకొని నేటి తరం హీరోలు రామ్ చరణ్, తేజా సజ్జా వరకు అందరితో సినిమాలు చేశారు ఆర్‌బీ చౌదరి. 1994లో శరత్ కుమార్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘కెప్టెన్’ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో సుస్వాగతం, వెంకటేష్‌తో సూర్యవంశం, రాజా, శీను, సంక్రాంతి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.
అలాగే నాగార్జునతో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా సినిమాలను నిర్మించి విజయాలను అందుకున్నారు. నేటి గాంధీ, ప్రియమైన నీకు, నువ్వు వస్తావని, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, శివరామరాజు, అందాల రాముడు, అన్నవరం, నవ వసంతం, గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ లాంటి చిత్రాలను నిర్మించి తెలుగులో మంచి ఇమేజ్ ఏర్పరచుకున్నారు. అశ్లీలత అసభ్యతకు తావు లేకుండా కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలను రూపొందించారు.
కోలీవుడ్‌లో టాప్..
1988లో వచ్చిన అదిపాపం అనే మలయాళ సినిమాతో నిర్మాతగా ఆర్‌బీ చౌదరి ప్రయాణం ప్రారంభమైంది. మురళీ, ఆనంద్ బాబు హీరోలుగా విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన పుదు వసంతం సినిమాతో నిర్మాతగా తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ సినిమాతో నిర్మాతగా కోలీవుడ్‌లో ఆర్‌బీ చౌదరి పేరు మారుమోగింది. తమిళంలో రజనీకాంత్, విజయ్ కాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్స్‌తో పలు సినిమాలు నిర్మించారు ఆర్‌బీ చౌదరి. ఎంతో మంది కొత్త దర్శకులను, నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు ఆర్‌బీ చౌదరి. కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న కేఎస్ రవికుమార్, విక్రమన్, లింగుసామి, శశి సహా మరికొంత మంది ఆర్‌బీ చౌదరి బ్యానర్‌తోనే తమ సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆర్‌బీ చౌదరి నిర్మించిన చివరి మూవీ మారేసన్ గత ఏడాది రిలీజైంది.
Shocking to hear the news of the demise of the most prolific producer #RBChoudhary sir. Unable to digest this news in the midst of shoot. In a Loss of words. Life is so uncertain. One of the biggest production houses in India. May his soul rest in peace. My deepest condolences… pic.twitter.com/MMPl4PedR6
— Vishal (@VishalKOfficial) May 5, 2026
సంబంధిత వార్తలు

TVK Vijay | మెజారిటీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో.. రాజ్‌భవన్‌లో కాదు.. విజయ్ కోసం గళమెత్తిన నేతలు
మే 7, 2026

R B Choudary | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం – రోడ్డు ప్రమాదంలో దిగ్గజ నిర్మాత కన్నుమూత
మే 5, 2026

Sai Dhanshika | ఓటీటీలోకి హీరో విశాల్‌కు కాబోయే భార్య తమిళ మూవీ
మార్చి 10, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



