త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KGF Co-Director Son Died | లిఫ్ట్‌లో ఇరుక్కొని కేజీఎఫ్ కో డైరెక్టర్ కొడుకు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం

తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయం అవుతున్న కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు.

J

Entertainment | Published On Dec 18, 2025, 7.33 pm IST

KGF Co-Director Son Died | లిఫ్ట్‌లో ఇరుక్కొని కేజీఎఫ్ కో డైరెక్టర్ కొడుకు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం
Advertisement

KGF Co-Director Son Died | ప్రముఖ కన్నడ దర్శకుడు, కేజీఎఫ్ మూవీ కో డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ కొడుకు సొనార్ష్ కే నాదగౌడ లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ సోనార్ష్ మృతికి సంతాపం ప్రకటించింది. నాలుగున్నర ఏళ్ల వయసు ఉన్న సోనార్ష్ ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మృతి చెందడం బాధించిందని టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఆయన తన సంతాపాన్ని ప్రకటించారు.

తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయం అవుతున్న కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. కీర్తన్, ఆయన భార్య సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి శివైక్యం చెందిన విషయం తెలిసి తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానన్నారు. కీర్తన్, సమృద్ధి దంపతులకు పవన్ తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పుత్ర శోకం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని ఆ దంపతులకు పరమేశ్వరుడు ఇవ్వాలని పవన్ వేడుకున్నారు.

Advertisement
Advertisement