Jr NTR | ఎన్టీఆర్‌కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
Jr NTR | ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Entertainment | Published On Aug 12, 2026, 4.57 pm IST
Jr NTR | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ ఆర్ఎ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కు త్వరలోనే ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందన్నారు. దాదాపు 2 నుండి 3 నెలల వ్యవధిలో సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్ల అంచనా వేశారు.
ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన ‘డ్రాగన్’ షూటింగ్‌పై కూడా తాజా అప్‌డేట్ వచ్చింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మొదటి నుంచే విపరీతమైన క్రేజ్ నెలకొంది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ – ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా…
ఆగస్టు 11, 2026

Tollywood | సీనియర్ సినీ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత – సూపర్ హిట్ సినిమాలకు రచయితగా!
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక
- ●Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
- ●Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ

Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక

Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు

Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు



