త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhurandhar 2 Review | కాంతార వివాదం.. రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’పై రిషబ్ శెట్టి రివ్యూ.. వెంకటేష్ కూడా..!

కాంతార మిమిక్రీ వివాదం కొనసాగుతుండగానే, రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'దురంధర్: ది రివెంజ్' చిత్రంపై కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ ప్రశంసలు కురిపించారు.

J

Entertainment | Published On Mar 22, 2026, 10.00 pm IST

Dhurandhar 2 Review | కాంతార వివాదం.. రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’పై రిషబ్ శెట్టి రివ్యూ.. వెంకటేష్ కూడా..!

సంక్షిప్త సారాంశం

గతేడాది ఇఫ్ఫీ (IFFI) వేడుకల్లో రణవీర్ సింగ్ 'కాంతార' క్లైమాక్స్‌ను అనుకరించి వివాదంలో చిక్కుకున్నప్పటికీ, రణవీర్ తాజా చిత్రం 'దురంధర్ 2' అద్భుతంగా ఉందంటూ రిషబ్ శెట్టి రివ్యూ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్ యుద్ధ భేరిలా మోగుతుందంటూ కొనియాడాడు. మరోవైపు, విక్టరీ వెంకటేష్ సైతం ఈ చిత్రాన్ని చూసి, రణవీర్ నటనను, దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను సోషల్ మీడియా వేదికగా అభినందించాడు.

Advertisement

Dhurandhar 2 Review | త్రినేత్ర.న్యూస్ : గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో రణవీర్ సింగ్ చేసిన 'కాంతార' మిమిక్రీ వివాదం ఇంకా ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగానే ఉంది. ఈ పరిస్థితుల మధ్య కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.. రణ్‌వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) పై తన రివ్యూను పంచుకున్నాడు. ఇది సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.

తన X (ఎక్స్) ఖాతాలో రిషబ్ శెట్టి స్పందిస్తూ.. "మొదటి సీన్ నుంచే మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ప్రతి ఫ్రేమ్ ఒక యుద్ధ భేరిలా బలంగా తాకుతుంది. ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఇదొక స్టేట్‌మెంట్. దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతమైన స్టోరీటెల్లింగ్, డిటైలింగ్ నాకు బాగా నచ్చాయి." అంటూ ట్వీ

https://x.com/shetty_rishab/status/2035336139025064299

అలాగే ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, రణవీర్ సింగ్, రాకేష్ బేడీ, సారా అర్జున్, సంజయ్ దత్ లాంటి తారాగణం నటనను ఆయన మెచ్చుకున్నాడు. వికాస్ నౌలాఖా విజువల్స్, శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం, శివకుమార్ వి.పనిక్కర్ ఎడిటింగ్ సినిమా స్థాయిని మరింత పెంచాయని సాంకేతిక బృందాన్ని సైతం ఆయన కొనియాడాడు.

అసలు కాంతార మిమిక్రీ వివాదం ఏంటి?

IFFI 2025 ముగింపు వేడుకల్లో రణవీర్ సింగ్ 'కాంతార: చాప్టర్ 1' క్లైమాక్స్‌లోని దైవ (Daiva) ఆరాధన సన్నివేశాన్ని అనుకరించడంతో ఈ వివాదం చెలరేగింది. ఆ సమయంలో రిషబ్ శెట్టి నవ్వుతూ కనిపించినప్పటికీ.. సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ఆచారాన్ని కించపరిచేలా రణ్‌వీర్ ప్రవర్తించాడని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దైవాన్ని 'దెయ్యం' అని రణ్‌వీర్ సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత, ఆ పెర్ఫార్మెన్స్ చేయవద్దని రణవీర్ సింగ్‌ను రిషబ్ శెట్టి సున్నితంగా హెచ్చరించిన మరో వీడియో బయటకు రావడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది.

'దురంధర్ 2' పై విక్టరీ వెంకటేష్ రివ్యూ

రణవీర్ సింగ్ చిత్రాన్ని వీక్షించిన వారిలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి కూడా ఉన్నాడు. ఈ సినిమా చూసిన అనంతరం ఆయన ఎక్స్ వేదికగా తన స్పందనను తెలియజేశాడు.

https://x.com/VenkyMama/status/2035618329579475294

"ధురంధర్ 2 చూసి ఆశ్చర్యపోయాను. రణ్‌వీర్ సింగ్ ఎప్పటిలాగే జస్కిరత్, హంజా పాత్రలకు ప్రాణం పోశాడు. ప్రతి ఫ్రేమ్‌లోనూ తన కళ్లతోనే ఎన్నో భావోద్వేగాలను పలికించాడు, నేను కళ్లు తిప్పుకోలేకపోయాను. ఈ సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఎంతో దార్శనికత, ధైర్యం కావాలి. నాలుగు గంటల సమయం ఇట్టే గడిచిపోయింది," అని వెంకటేష్ ప్రశంసించారు. మాధవన్ స్క్రీన్ ప్రెజెన్స్, శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం చాలా బాగున్నాయని, ఇదొక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.

'దురంధర్ 2' చిత్రం గురించి

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'దురంధర్: ది రివెంజ్' ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లోకి చొరబడే భారతీయ గూఢచారి హంజా అలీ మజారీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement