Grammy Awards | ధురంధర్2 కు నిరాశ – గ్రామీ నామినేషన్స్‌లో తమిళ పాటకు చోటు – షకీరాతో పోటీ
69వ గ్రామీ అవార్డుల నామినేషన్లలో ధురంధర్2కు నిరాశ మిగిలింది. ఎనిమిది విభాగాల్లో ఎంట్రీలను పంపించగా... ఈ బాలీవుడ్ మూవీ ఒక్క స్థానంలో కూడా అర్హత సాధించలేదు. ఎవరూ ఊహించని విధంగా తమిళ ఇండిపెండెంట్ సాంగ్ వరువాయి తుది నామినేషన్లలో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది ఇండియా నుంచి గ్రామీకి నామినేట్ అయిన ఒకే ఒక సాంగ్ ఇదే.
Entertainment | Published On Nov 17, 2026, 2.50 pm IST
Grammy Awards |గ్రామీ 2027 నామినేషన్స్‌లో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ధురంధర్ 2కు నిరాశ ఎదురైంది. 2027 ఏడాదిలో జరుగనున్న గ్రామీ అవార్డుల నామినేషన్లను సోమవారం ప్రకటించారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ధురంధర్ 2 కనీసం ఐదారు నామినేషన్లలో చోటు దక్కించుకోవచ్చునని ప్రచారం జరిగింది. మొత్తం ఎనిమిది విభాగాల్లో ఎంట్రీలను పరిశీలన కోసం మేకర్స్ పంపించారు. సోమవారం ప్రకటించిన తుది జాబితాలో ధురంధర్ 2 ఒక్క స్థానంలో అర్హతను సాధించలేకపోయింది. ఎనిమిది విభాగాల్లో ఎందులో నామినేషన్ దక్కించుకోలేకపోయింది.
మ్యూజికల్‌గా...
గ్రామీ అవార్డుల కోసం బెస్ట్ సాంగ్ రిటన్ ఫర్ విజువల్ మీడియా , బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్మార్మెన్స్ , బెస్ట్ ఏషియన్ పాప్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ , బెస్ట్ ర్యాప్ పర్మార్మెన్స్‌తో పాటు మరికొన్ని విభాగాల్లో మేకర్స్ ఎంట్రీలను పంపించారు. మ్యూజికల్‌గా ధురంధర్ సీక్వెల్ పెద్ద విజయాన్ని సాధించడంతో గ్రామీలో ఈ సినిమా సత్తా చాటే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. ఊహించని విధంగా అవార్డుల కమిటీ ఈ బాలీవుడ్ మూవీకి పెద్ద షాకిచ్చింది.
తమిళ పాట...
గ్రామీ నామినేషన్లలో ఇండియా నుంచి కేవలం ఒకే ఒక పాట మాత్రమే నామినేషన్లలో నిలిచింది. తమిళ ఇండిపెండెంట్ సాంగ్ వరువాయి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫర్మార్మెన్స్ విభాగంలో తుది నామినేషన్ జాబితాలో చోటు దక్కించుకుంది. గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన మొదటి తమిళ పాటగా వరువాయి రికార్డ్ క్రియేట్ చేసింది. వరువాయి సాంగ్‌కు దేవన్ ఏకాంబరం మ్యూజిక్ అందించాడు. కర్ణాటక సింగర్ సుభీక్ష రంగరాజన్ ఆలపించారు. తమిళ దిగ్గజ రచయిత భారతియార్ రాసిన పాట ఇది. శ్రీకృష్ణుడిపై రాసిన ఈ భక్తి గీతానికి వెస్ట్రన్ స్టైల్‌లో మార్చి దేవన్ ఏకాంబరం ఈ పాటను రూపొందించారు.
బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫర్మార్మెన్స్ కేటగిరీలో షకీరా, రోసాలియా వంటి ఇంటర్నేషనల్ సింగర్స్ పాటలతో వరువాయి పోటీపడబోతుండటం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kriti Sanon | ప్రియుడికి రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ – లవ్‌స్టోరీని కన్ఫామ్ చేసిన ప్రభాస్ హీరోయిన్
నవంబర్ 20, 2026

Esther Anil | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా వెంకటేష్ చిన్నకూతురు – తొమ్మిది భాషల్లో రిలీజ్
నవంబర్ 20, 2026

Ananya Panday | సినిమా ఛాన్స్‌లు నిల్ – లైగర్ హీరోయిన్ ఆశలన్నీ కరణ్ జోహార్ వెబ్‌సిరీస్ పైనే!
నవంబర్ 17, 2026
తాజావార్తలు
- ●KTR Challenge to Revanth Reddy | కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయాలకు స్వస్తి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
- ●BRS KRMB Meeting | సాగర్ జలాలపై రగడ.. రేపు KRMB వద్దకు బీఆర్ఎస్ బృందం
- ●Serial Actress | సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోయిన్
- ●ICE Agents Seattle Airport | ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఆఫీసర్లు
- ●OM vs AOT | ఓం వర్సెస్ ఆకాశంలో ఒక తార - రెండు రోజుల్లో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే?
- ●Hyderabad Bomb Threat Email | కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను బాంబులతో పేల్చేస్తాం

KTR Challenge to Revanth Reddy | కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయాలకు స్వస్తి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

BRS KRMB Meeting | సాగర్ జలాలపై రగడ.. రేపు KRMB వద్దకు బీఆర్ఎస్ బృందం

Serial Actress | సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోయిన్

ICE Agents Seattle Airport | ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఆఫీసర్లు



