త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nana Patekar | భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటుల్లో నానా పటేకర్‌ ఒకరు: జూనియర్‌ ఎన్టీఆర్‌

Nana Patekar | బాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత నానా ప‌టేక‌ర్ (Nana Patekar) మృతి ప‌ట్ల‌ యంగ్ టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. భారతీయ సినిమా రంగంలోని (Indian cinema) అత్యుత్తమ నటుల్లో నానా పటేకర్ ఒకర‌న్నారు.

G

Entertainment | Published On Oct 8, 2026, 10.57 am IST

Nana Patekar | భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటుల్లో నానా పటేకర్‌ ఒకరు: జూనియర్‌ ఎన్టీఆర్‌
Advertisement

Nana Patekar | త్రినేత్ర న్యూస్‌: బాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత నానా ప‌టేక‌ర్ (Nana Patekar) మృతి ప‌ట్ల‌ యంగ్ టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. భారతీయ సినిమా రంగంలోని (Indian cinema) అత్యుత్తమ నటుల్లో నానా పటేకర్ ఒకర‌న్నారు. ఆయ‌న అద్భుత‌మైన‌ న‌ట‌న త‌ర‌త‌రాల‌కు గుర్తుండిపోతుంది అంటూ ఎక్స్ వేదిక‌గా సంతాపం తెలిపారు.

`భార‌తీయ సినిమా రంగంలో అత్యుత్త‌మ న‌టుల్లో ఒక‌రైన నానా ప‌టేక‌ర్ మ‌ర‌ణ వార్త విని తీవ్రంగా విచారిస్తున్నా. ఆయ‌న పోషించిన ప్ర‌తి పాత్ర‌లోనూ స్ప‌ష్ట‌మైన నిజాయితీ, తీవ్ర‌త క‌నిపించేవి. ఆయ‌న యాక్టింగ్ ఎప్పుడూ న‌ట‌న‌లా అనిపించేది కాదు. తెర‌పై ఆవిష్కృత‌మ‌వుతున్న జీవంలా ఉండేది. భార‌తీయ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌లు, అద్భుత‌మైన న‌ట‌న త‌ర‌త‌రాల‌పాటు గుర్తుండిపోతాయి. నానా ప‌టేక‌ర్ కుటుంబ స‌భ్యుల‌కు, ఆత్మీయుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి` అంటూ ట్వీట్ చేశారు.

ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు..

ప్ర‌ముఖ నటుడు నానా పటేకర్‌ మృతి పట్ల ప్రధాని మోదీ (PM Modi) విచారం వ్యక్తం చేశారు. కొద్దిమంది న‌టుల‌కే ఉండే తీవ్ర‌త‌, ప్ర‌త్యేక‌త‌, చెర‌గ‌ని ఉనికి ఆయ‌న సొంతం. ప్ర‌తి పాత్ర‌లోనూ లీనమై అద్భుత‌మైన వైవిధ్యం, సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. తరతరాలు గుర్తుండిపోయే పాత్రలు మ‌న‌కు అందించారు. తాను నమ్మిన విషయాన్ని వ్యక్తపరిచేందుకు నానాపటేకర్ ఏనాడూ సంకోచించలేదు. నానా పటేకర్ త‌న న‌ట‌న‌తోనే కాదు.. నిర్మొహ‌మాట‌మైన‌, ముక్కుసూటి అభిప్రాయాలతోనూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్ర‌ధాని మోదీ కొనియాడారు.

ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు..

నానా పటేకర్ ఆకాల మరణం పట్ల న‌టుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే గొప్ప నటుడు నానా పటేకర్ అని కొనియాడారు. భారత సైన్యంలో గౌరవపూర్వక సేవలందించారని చెప్పారు.

Advertisement
Advertisement