త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhurandhar OTT | దురంధ‌ర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్.. ఎప్ప‌టి నుంచంటే?

Dhurandhar OTT | ఒకే భాష‌లో విడుద‌లై భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచిన దురంధ‌ర్ (Dhurandhar) రికార్డు సృష్టించింది. ఆదిత్య ధర్ (Aditya Dhar) ద‌ర్శ‌క‌త్వంలో రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh) హీరోగా తెర‌కెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది.

G

Entertainment | Published On Jan 22, 2026, 8.07 am IST

Dhurandhar OTT | దురంధ‌ర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్.. ఎప్ప‌టి నుంచంటే?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఒకే భాష‌లో విడుద‌లై భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచిన దురంధ‌ర్ (Dhurandhar) రికార్డు సృష్టించింది. ఆదిత్య ధర్ (Aditya Dhar) ద‌ర్శ‌క‌త్వంలో రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh) హీరోగా తెర‌కెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీని కూడా ఒక‌ ఊపుఊపేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (Dhurandhar OTT) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతోపాటు ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ నెల 30 నుంచి ప్ర‌సారం కానుందని తెలుస్తున్న‌ది.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన‌ పోస్టర్లు నెట్టింట‌ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సుమారు రూ.130 కోట్ల‌కు ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

పాకిస్థాన్‌కి వెళ్లి అక్కడ పనిచేసిన ఓ ఏజెంట్ కథతో, నిజ‌జీవితంలో జరిగిన పాకిస్థాన్ – భారత్ కి చెందిన కొన్ని సంఘటనల నేపథ్యంలో దురంధర్ సినిమాని తెరకెక్కించారు. రణవీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, మాధవన్.. కీలక పాత్రల్లో న‌టించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement