Dhurandhar 2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ధురంధర్ 2.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Dhurandhar 2 | త్రినేత్ర.న్యూస్: స్పై యాక్షన్ త్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ధురంధర్ 2’ చిత్రం (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ కనీవినీ ఎరుగని వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్నది.
Entertainment | Published On Apr 10, 2026, 8.17 am IST
Dhurandhar 2 | త్రినేత్ర.న్యూస్: స్పై యాక్షన్ త్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ధురంధర్ 2’ చిత్రం (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ కనీవినీ ఎరుగని వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్నది. మూడు వారాల్లోనే సుమారు రూ.1700 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీ, త్వరలోనే 1800 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పది చిత్రాల జాబితాలో ‘ధురంధర్ 2’ స్థానం సంపాదించుకున్నది. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్‌లోనూ ఈ మూవీ థియేటర్లలో కలెక్షన్లు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.
ఇక ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి (OTT) వస్తుందా అని ఎదురుచూస్తున్న వారి కోసం ఇప్పుడు ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తున్నది. దురంధర్ మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో (netflix) విడుదలై రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. రెండో భాగానికి (Dhurandhar 2 OTT) కూడా ఆ సంస్థ రూ.250 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చింది. అయితే దానిని తిరస్కరించింది చిత్ర నిర్మాతలు ‘జియో హాట్ స్టార్ (Jio hotstar) లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలుత సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. అయితే క్రమంగా థియేట్రికల్ రన్ తగ్గుతుండటంతో మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలోనే డిజిటల్ ప్రీమియర్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. 2025లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్. మొదటి భాగం 150 మిలియన్ డాలర్ల వద్ద ఆగిపోగా.. రెండో భాగం ఆ మార్కును అలవోకగా దాటేసింది. రణవీర్ సింగ్ అద్భుత నటనతో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ వంటి దిగ్గజ తారల పెర్ఫార్మెన్స్ ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.
ఇండియన్ మార్కెట్‌లో రూ.1,000 కోట్ల నెట్ (రూ.1,246 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించిన ధురంధర్ 2.. గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోయినప్పటికీ, నార్త్ అమెరికాలో 26 మిలియన్ డాలర్లు, మిగతా దేశాల్లో 15 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం గురువారం (ఏప్రిల్ 9) నాటికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 178 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,656 కోట్లు) కు చేరుకుంది.
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

Ashu Reddy | అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోల వెనకున్న ట్విస్ట్ ఇదే – రియల్ కాదు…రీల్ లైఫ్‌లో…
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



