త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur in Dacoit | ‘డెకాయిట్‌’లో నా క్యారెక్టర్ మైండ్ బ్లోయింగ్.. రిస్కీ స్టంట్స్ చేశాను: మృణాల్ ఠాకూర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ 'డెకాయిట్' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తాను పోషించిన 'సరస్వతి' పాత్ర, అందులోని రిస్కీ యాక్షన్ స్టంట్స్ తన కెరీర్‌లోనే బెస్ట్ అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పంచుకున్నారు.

J

Entertainment | Published On Apr 6, 2026, 10.00 pm IST

Mrunal Thakur in Dacoit | ‘డెకాయిట్‌’లో నా క్యారెక్టర్ మైండ్ బ్లోయింగ్.. రిస్కీ స్టంట్స్ చేశాను: మృణాల్ ఠాకూర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
Advertisement

Mrunal Thakur in Dacoit | త్రినేత్ర.న్యూస్ : 'సీతారామం', 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అందాల తార మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఇప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తి యాక్షన్ అవతారంలోకి మారారు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతున్న అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్‌' (Dacoit) లో మృణాల్ హీరోయిన్.

షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మృణాల్ ఠాకూర్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.

'Dacoit' Movie Interview Mrunal Thakur Opens Up on Risky Action Stunts and Working with Adivi Sesh

నా కెరీర్‌లోనే ఛాలెంజింగ్ రోల్: సరస్వతి

'డెకాయిట్'లో తాను పోషించిన 'సరస్వతి' పాత్ర తన కెరీర్‌లోనే ఎంతో డిఫరెంట్ అని మృణాల్ చెప్పారు. "ఇందులో నా పాత్ర చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది. ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయడం ఒక నటిగా ఎంతో సంతృప్తినిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను తమ ఇంటి అమ్మాయిలా ఆదరించారు. సీత పాత్రను ఎంతగానో ప్రేమించారు. అయితే, సీతకు సరస్వతికి ఎలాంటి పోలిక ఉండదు. నన్ను కొత్తగా చూడాలనుకునేవారికి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా పెద్ద సర్ప్రైజ్ ఇస్తుంది" అని మృణాల్ పేర్కొన్నారు.

రిస్కీ యాక్షన్.. బ్రేక్ లేని అంబులెన్స్ డ్రైవింగ్!

ఈ సినిమాలో తాను స్వయంగా యాక్షన్ సీన్స్ చేసినట్లు మృణాల్ వెల్లడించారు. "నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కార్ డ్రైవ్ చేసిన మొదటి అమ్మాయిని నేనే. ఈ సినిమాలో చాలా రోడ్ డ్రైవింగ్, చేజింగ్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్ లేని ఒక అంబులెన్స్‌ను డ్రైవ్ చేస్తూ రిస్కీ స్టంట్స్ చేశాను. ఆ యాక్షన్ సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు" అని ఆనందం వ్యక్తం చేశారు.

'Dacoit' Movie Interview Mrunal Thakur Opens Up on Risky Action Stunts and Working with Adivi Sesh

అడివి శేష్, అనురాగ్ కశ్యప్‌లతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్..

అడివి శేష్ డెడికేషన్ గురించి చెబుతూ.. "శేష్ గారు ఒక సెల్ఫ్ మేడ్ స్టార్. సినిమాలోని ప్రతి చిన్న విషయంపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. రైటింగ్, డైరెక్షన్ ఇలా అన్నింటిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అద్భుతం. ఈ సినిమాలో ఆయన మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు" అని కొనియాడారు.

బాలీవుడ్ ప్రముఖుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంపై స్పందిస్తూ.. "అనురాగ్ గారు అద్భుతమైన డైరెక్టరే కాదు, వెర్సటైల్ యాక్టర్ కూడా. మేమిద్దరం హిందీ నేపథ్యం నుంచి రావడంతో, సెట్స్‌లో కలిసి తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడం చాలా ఫన్‌గా అనిపించింది" అని మృణాల్ తెలిపారు.

'Dacoit' Movie Interview Mrunal Thakur Opens Up on Risky Action Stunts and Working with Adivi Sesh

హాలీవుడ్ రేంజ్ విజువల్స్.. అద్భుతమైన మ్యూజిక్

దర్శకుడు శానియల్ డియో పనితీరును మృణాల్ ప్రశంసించారు. "డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్ ముగ్గురి సింక్ వల్ల సినిమా విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వచ్చాయి. అలాగే, కథలోని సరస్వతి, హరి అసలు ఎందుకు డెకాయిట్స్‌గా (బందిపోట్లు) మారారు అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన అద్భుతమైన లవ్ స్టోరీ" అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన 'రూబారు', 'కన్నేపెట్టరో' పాటలకు వస్తున్న రెస్పాన్స్ పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

చివరగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ గురించి చెబుతూ.. "నాకు జ్వరం వస్తే ఏకంగా రెండు రోజుల పాటు షూటింగ్ ఆపేశారు. నటీనటుల ఆరోగ్యం గురించి ఇంతగా శ్రద్ధ తీసుకునే ప్రొడ్యూసర్‌ను నేను చూడలేదు" అని మృణాల్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన 'డెకాయిట్', ఏప్రిల్ 10న ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

'Dacoit' Movie Interview Mrunal Thakur Opens Up on Risky Action Stunts and Working with Adivi Sesh

Advertisement
Advertisement