Wamiqa Gabbi | “డీసీ”తో మారిన జాతకం – నందమూరి హీరో సరసన వామికా గబ్బి
డీసీ హిట్‌తో వామికా గబ్బి జాతకం మారిపోయింది. ఈ బ్లాక్‌బస్టర్‌తో దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో వామికా గబ్బి రొమాన్స్ చేయబోతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ ప్రయోగాత్మక సినిమా రాబోతుంది.
Entertainment | Published On Nov 15, 2026, 5.41 pm IST
Wamiqa Gabbi | లోకేష్ కనగరాజ్ "డీసీ" మూవీ వామికా గబ్బి జాతకాన్ని మార్చేసింది. ఈ బ్లాక్‌బస్టర్‌కు ముందు తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా చిన్న సినిమాలు చేసింది. "డీసీ"తో ఇప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. లోకేష్ కనగరాజ్ హీరోగా యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన "డీసీ"లో వేశ్య పాత్రలో వామికా గబ్బి అసమాన నటనను కనబరిచింది. ఈ బాలీవుడ్ బ్యూటీ నటనకు సినీ వర్గాలతో పాటు ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు.
గూఢచారి 2...
"డీసీ" తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వామికా గబ్బి క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2లో యాక్షన్ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. తాజాగా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. నందమూరి హీరోతో రొమాన్స్ చేయబోతుంది.
ప్రయోగాత్మక కథాంశంతో...
ప్రస్తుతం "జనవరి 12 విడుదల" మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాను కొత్త డైరెక్టర్‌తో చేయబోతున్నాడు. ప్రయోగాత్మక కథాంశంతో ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్నఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా వామికా గబ్బి హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో రా అండ్ రస్టిక్ రోల్‌లో ఈ బాలీవుడ్ హాట్‌బ్యూటీ కనిపించబోతున్నట్లు సమాచారం.
డిసెంబర్‌లో...
డిసెంబర్‌లో కళ్యాణ్ రామ్ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలిసింది. 2015లో రిలీజైన భలే మంచి రోజుతో హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది వామికా గబ్బి. ఈ సినిమా హిట్టైనా టాలీవుడ్ లో మాత్రం మళ్లీ అవకాశాలు రాలేదు. దాదాపు పదేళ్ల తర్వాత గూఢచారి 2తో పాటు కళ్యాణ్ రామ్ సినిమాలతో కమ్‌బ్యాక్ ఇవ్వబోతుంది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, పంజాబీ, మలయాళ భాషల్లో కలిపి ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలు చేస్తోంది వామికా గబ్బి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay – Rashmika | జపాన్ వెకేషన్లో విరోష్ – రొమాంటిక్ ట్రిప్ ఫొటోలు వైరల్
నవంబర్ 15, 2026

Tollywood | రద్దైన కరెన్సీ నోట్లతో కథతో మోసపోయాం జానకి – తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ
నవంబర్ 15, 2026

Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ – మెగాస్టార్‌తో స్టెప్పులు
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Dhanush | రెండున్నర కోట్ల వాచ్‌తో ధనుష్ - "ఓం" ప్రమోషన్స్‌లో దాని గురించే చర్చ!
- ●Telangana | ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ
- ●AIIMS Delhi Open Fetal Surgery | తల్లి గర్భంలో ఉండగానే బిడ్డకు సర్జరీ.. భారత్‌లో ఇదే తొలిసారి
- ●KTR | నిరుద్యోగులకు రాకేశ్‌రెడ్డి మెటీరియల్ ఇవ్వడం అభినందనీయం: కేటీఆర్
- ●Minister Uttam Kumar Reddy | పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇప్పించండి
- ●Vande Bharat Brake Failure | బ్రేకులు లేకుండానే 463 కిమీలు పరుగులు తీసిన వందే భారత్

Dhanush | రెండున్నర కోట్ల వాచ్‌తో ధనుష్ - "ఓం" ప్రమోషన్స్‌లో దాని గురించే చర్చ!

Telangana | ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ

AIIMS Delhi Open Fetal Surgery | తల్లి గర్భంలో ఉండగానే బిడ్డకు సర్జరీ.. భారత్‌లో ఇదే తొలిసారి

KTR | నిరుద్యోగులకు రాకేశ్‌రెడ్డి మెటీరియల్ ఇవ్వడం అభినందనీయం: కేటీఆర్



