త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aamir Khan | ముచ్చ‌ట‌గా మూడో పెళ్లికి సిద్ధ‌మైన అమీర్‌ఖాన్‌..! ఎవ‌రీ గౌరీ..?

Aamir Khan | బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమీర్ ఖాన్( Aamir Khan ) మ‌రో పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. త‌న ప్రేయ‌సి గౌరీ స్ప్ర‌ట్‌( Gauri Spratt ) ను వివాహ‌మాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్‌, గౌరీ జులై 5వ తేదీన మూడు ముళ్లు, ఏడ‌డుగుల బంధంతో ఒక్క‌టి కాబోతున్న‌ట్లు స‌మాచారం.

S

Entertainment | Published On Jun 4, 2026, 9.32 am IST

Aamir Khan | ముచ్చ‌ట‌గా మూడో పెళ్లికి సిద్ధ‌మైన అమీర్‌ఖాన్‌..! ఎవ‌రీ గౌరీ..?
Advertisement

Aamir Khan | త్రినేత్ర‌.న్యూస్ : బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమీర్ ఖాన్( Aamir Khan ) మ‌రో పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. త‌న ప్రేయ‌సి గౌరీ స్ప్ర‌ట్‌( Gauri Spratt ) ను వివాహ‌మాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్‌, గౌరీ జులై 5వ తేదీన మూడు ముళ్లు, ఏడ‌డుగుల బంధంతో ఒక్క‌టి కాబోతున్న‌ట్లు స‌మాచారం.

అయితే అమీర్ ఖాన్ ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. రీనా ద‌త్తా, కిర‌ణ్ రావుల‌ను పెళ్లాడారు. గౌరీ ఇక మూడో భార్య‌. అయితే గౌరీకి ఇప్ప‌టికే ఏడేళ్ల వ‌య‌సున్న బిడ్డ కూడా ఉన్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న ప్రేయ‌సీ గౌరీని గ‌తేడాది త‌న 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా అమీర్‌ఖాన్ మీడియాకు ప‌రిచ‌యం చేశారు. త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో గౌరీ ప‌ని చేస్తున్న‌ట్లు కూడా చెప్పారాయ‌న‌. అయితే ఈ విష‌యాల‌న్నీ మీడియాకు వెల్ల‌డించ‌క‌ముందే.. ఆయ‌న ఓ మ‌హిళ‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు కూడా పుకార్లు వ‌చ్చాయి. మొత్తానికి గౌరీతో కొన‌సాగుతున్న ప్రేమాయ‌ణాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డంతో డేటింగ్ వార్త‌ల‌కు తెర‌ప‌డింది.

ఎవ‌రీ గౌరీ..?

గౌరీ స్వ‌స్థ‌లం బెంగ‌ళూరు. బెంగ‌ళూరులో స్వంతంగా సెలూన్ న‌డుపుతున్న రీతా స్ప్ర‌ట్ కుమార్తెనే గౌరీ. ఈమె బ్లూ మౌంటెన్ స్కూల్‌లో త‌న విద్యాభ్యాసాన్ని కొన‌సాగించారు. 2004లో లండ‌న్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఫ్యాష‌న్ కోర్సు ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫొటోగ్ర‌ఫీ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ఆమె ముంబైలో BBlunt అనే సెలూన్‌ను నిర్వ‌హిస్తున్నారు.

1986లో రీనా ద‌త్తాతో తొలి వివాహం

అమీర్ ఖాన్ 1986లో రీనా ద‌త్తాను వివాహం చేసుకున్నారు. ఈమె అమీర్ ఖాన్ చిన్న‌నాటి ప్రేయ‌సి. వీరికి కుమారుడు జునైద్, కుమార్తె ఐరా ఉన్నారు. జునైద్ సినిమా రంగంలో ఉన్నాడు. అయితే రీనా ద‌త్తాతో 16 ఏండ్ల పాటు సంసార జీవితం కొన‌సాగించి 2002లో విడాకులు తీసుకున్నారు అమీర్ ఖాన్.

2005లో కిర‌ణ్ రావుతో రెండో పెళ్లి

రీనా ద‌త్తాతో విడాకుల అనంత‌రం 2005లో కిర‌ణ్ రావును పెళ్లి చేసుకున్నారు ఖాన్. 2001లో వ‌చ్చిన లగాన్ సినిమా సంద‌ర్భంగా కిర‌ణ్ రావుతో అమీర్ ఖాన్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. అక్క‌డ ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి దాకా దారి తీసింది. 2021లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. అయితే స‌రోగ‌సి ద్వారా జ‌న్మించిన కుమారుడు అజాద్‌ను వీరిద్ద‌రూ క‌లిసి పెంచుతున్నారు.

గౌరీని గొప్ప అదృష్టంగా భావిస్తున్నా..

గౌరీ త‌న జీవితంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత తాను ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని అమీర్ ఖాన్ న‌వ‌భార‌త్ టైమ్స్‌తో జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించారు. గౌరీ త‌నతో క‌లిసి రావ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. ఆమె చాలా గొప్ప వ్య‌క్తి. ఆమెతో ఉన్నంత సేపు ఎంతో ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. రీనా ద‌త్తా, కిర‌ణ్ రావుతో కూడా త‌న‌కెంతో అనుబంధం ఉన్న‌ప్ప‌టికీ, ఆ బంధాలు ఎక్కువ కాలం నిల‌వ‌లేక‌పోయాయని అమీర్ ఖాన్ తెలిపారు.

Advertisement
Advertisement