Nargis Fakhri | బాలయ్య సినిమాలో హాట్ హీరోయిన్ … ఐటెంసాంగ్ కోసం రంగంలోకి బాలీవుడ్ సెన్సేషన్
టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On May 7, 2026, 2.41 pm IST
Nargis Fakhri | ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. టాలీవుడ్ నుంచి ఓ మూవీ రిలీజ్ అవుతుందంటే దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. తెలుగు సినిమాల క్రేజ్ రాను రాను పెరుగుతుండటంతో టాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు అన్ని భాషల హీరోయిన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీపికా, అలియా తర్వాత...
దీపికా పడుకోన్, అలియా భట్ వంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేశారు. తాజాగా వీరి బాటలో మరో హాట్ బ్యూటీ అడుగులు వేయబోతుంది. నర్గీస్ ఫక్రీ టాలీవుడ్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే హీరోయిన్‌గా కాదు..స్పెషల్ సాంగ్‌తో తెలుగు చిత్రసీమలోకి తొలి అడుగు వేయబోతుంది.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ...
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. వీరసింహారెడ్డి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఎన్‌బీకే 111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మాసీగా సాగే ఈ ప్రత్యేక గీతంలో బాలకృష్ణతో బాలీవుడ్ హాట్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ స్టెప్పులు వేయబోతున్నదట. ఈ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్‌లో భారీ వ్యయంతో సెట్ వేశారట వేశారట. ఈ సెట్‌లో బాలకృష్ణ, నర్గీస్ ఫక్రీలపై శుక్రవారం నుంచి (మే 8న) ఈ ఐటెంసాంగ్‌ను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ పాటలో నర్గీస్ ఫక్రీ డ్యాన్స్ అదిరిపోతుందని అంటున్నారు.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ...
రణభీర్ కపూర్ హీరోగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందిన రాక్‌స్టార్ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నర్గీస్ ఫక్రీ. తొలి సినిమాతోనే పెద్ద సక్సెస్ అందుకుంది. హిందీలో మై తేరా హీరో, అమవాస్, హౌజ్‌ఫుల్ 5, మస్తీ 4తో పాటు మరికొన్ని సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



