Bhagyashri Borse | మోహన్‌లాల్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ బోర్సే – ఫొటోతో రూమర్లకు చెక్
మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న ఆపరేషన్ గంగ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే దర్శకనిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ సినిమా నుంచి భాగ్యశ్రీ తప్పుకున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లకు లెనిన్ హీరోయిన్ వెరైటీగా చెక్ పెట్టింది.
Entertainment | Published On Oct 1, 2026, 2.41 pm IST
Bhagyashri Borse | లెనిన్‌తో తనపై పడిన ఐరెన్‌లెగ్ ముద్ర నుంచి బయటపడింది భాగ్యశ్రీ బోర్సే. ఈ ముద్దుగుమ్మ పరాజయాల పరంపరకు ఈ సినిమాతో బ్రేక్ పడింది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాలో అందం, ధైర్యం కలబోసిన భారతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది భాగ్యశ్రీ బోర్సే. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా కాకుండా కథలో ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది.
గ్లామర్ పాత్రలకు దూరం...
లెనిన్ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తోందిభాగ్యశ్రీ బోర్సే. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటోంది. హీరోయిన్‌గా ఇప్పటివరకు తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేసిన ఈ సుందరి తాజాగా మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అగ్ర నటుడు మోహన్‌లాల్‌తో ఓ సినిమాను అంగీకరించింది. ఆపరేషన్ గంగ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను ఇటీవలే అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
విభేదాలు...
అయితే డేట్స్ ఇష్యూతో పాటు దర్శకనిర్మాతలతో ఏర్పడిన విభేదాలు కారణంగా మోహన్‌లాల్ సినిమా నుంచి భాగ్యశ్రీ బోర్సే తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ డెబ్యూ మూవీ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్ట్‌లు కనిపించాయి. ఈ రూమర్లకు ఓ ఫొటోతో చెక్ పెట్టింది భాగ్యశ్రీ బోర్సే.
ఆశీర్వాదం...
ఆపరేషన్ గంగ షూటింగ్ సెట్స్‌లో మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "మీతో కలిసి సినిమా చేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ సినిమా సెట్స్‌లో మీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను" అంటూ ఈ పోస్ట్‌కు కామెంట్‌ను జోడించింది. ఈ ఫొటోతో మలయాళం డెబ్యూ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు వస్తోన్న రూమర్లకు భాగ్యశ్రీ బోర్సే చెక్ పెట్టింది.
ఆపరేషన్ గంగ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ విష్ణుమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ వార్ సినిమాలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం చేపట్టిన సీక్రెట్ మిషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | 25 కోట్ల బడ్జెట్ – 325 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి మమితాబైజు మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ
సెప్టెంబర్ 27, 2026

Manju Warrier | పెళ్లి చేసుకోవాలంటూ డైరెక్టర్ వేధింపులు – కోర్టును ఆశ్రయించిన మలయాళ హీరోయిన్
సెప్టెంబర్ 20, 2026

Bhagyashri Borse | రష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ – హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Hyderabad Service Apartments Police Warning | మీ సర్వీస్ అపార్ట్మెంట్లో ఇవి జరిగితే ఇల్లు సీజ్ చేస్తాం: సైబరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. వారం రోజుల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి..
- ●Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర
- ●Mumbai UPI Protest | రూ.2,000 దాటితే యూపీఐ వాడరా? కొత్త ఛార్జీలపై భగ్గుమంటున్న జనం.. సర్వేలో షాకింగ్ నిజాలు
- ●Ntr | ఎన్టీఆర్ వాచ్ ధర రెండు కోట్లా? - చిన్న సినిమా బడ్జెట్‌తో సమానమంటూ నెటిజన్ల కామెంట్లు
- ●B Vinod Kumar | 8 వేల ఎకరాల కబ్జాను తేల్చకుంటే సీఎం వ్యాఖ్యలను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్

Hyderabad Service Apartments Police Warning | మీ సర్వీస్ అపార్ట్మెంట్లో ఇవి జరిగితే ఇల్లు సీజ్ చేస్తాం: సైబరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక

Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. వారం రోజుల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి..

Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర

Mumbai UPI Protest | రూ.2,000 దాటితే యూపీఐ వాడరా? కొత్త ఛార్జీలపై భగ్గుమంటున్న జనం.. సర్వేలో షాకింగ్ నిజాలు



