Bandla Ganesh | కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్
Bandla Ganesh | ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. షాద్‌నగర్ (Shadnagar) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
Entertainment | Published On Aug 22, 2026, 10.24 am IST
Bandla Ganesh | త్రినేత్ర.న్యూస్: ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. షాద్‌నగర్ (Shadnagar) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెండ్లికి సంబంధించి ఏర్పాట్ల సందర్భంగా గణేశ్ తన మనసులోని మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పంచుకున్నారు. ఆయన కూడా గణేశ్‌కు భరోసా ఇచ్చారు.
షాద్‌నగర్‌లో బండ్ల గణేశ్ కుటుంబానికి పౌల్ట్రీ వ్యాపారం ఉంది. ఆయన తల్లితండ్రులు అక్కడే ఉంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన గణేశ్ ఆ వర్గం తరపున తనకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఎన్నికలు 2028లో వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నియోజకవర్గంలో (Assembly Elections) కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొంత కాలం గణేశ్ పనిచేసారు. అయితే ఆయన ఆర్థికంగా కష్ట కాలంలో ఉన్నపుడు తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబు ఆదుకున్నారు. గణేశ్ స్వతహాగా టీడీపీ (TDP)అభిమాని. అయితే ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేకపోతే ఆయన జనసేన (Janasena) నుంచి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆయన తొలి ప్రాధాన్యం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోతే జనసేన నుంచి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో బండ్ల గణేశ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఖాయం అని అంటున్నారు.

హాస్య నటుడిగా సినిమాల్లోకి..
ఇటీవలే (ఆగస్టు 16న) తన కూతురు జనని వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన బండ్ల గణేశ్.. హాస్య నటుడిగా, సహాయ నటుడిగా తన నటజీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన `సుస్వాతం` మూవీతో టాలీవుడ్‌కు పరిచమయ్యారు. ఆ తర్వాత సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ వంటి సూపర్ హిట్ మూవీలతో హాస్య నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెత్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి (చిరంజీవి, పవన్ కల్యాణ్) ఆయన పరమ భక్తుడిగా పేరొందారు.
నిర్మాతగా..
2009లో రవితేజ హీరోగా వచ్చిన 'ఆంజనేయులు' సినిమాతో తన నిర్మాతగా మారారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మించారు. పవన్ కల్యాణ్‌తో ఆయన నిర్మించిన 'గబ్బర్ సింగ్' సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'బాద్ షా', 'టెంపర్', అల్లు అర్జున్‌తో 'ఇద్దరు అమ్మాయిలతో', రామ్ చరణ్‌తో 'గోవిందుడు అందరివాడేలే' వంటి భారీ చిత్రాలను నిర్మించారు. ఇటీవలే `బీజీ బ్లాక్‌బస్టర్స్' (BG Blockbusters) అనే సరికొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Harish Rao | బీఆర్ఎస్ నేతల సనత్‌నగర్ టిమ్స్ సందర్శన.. హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్..
ఆగస్టు 19, 2026

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్
- ●Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..
- ●Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
- ●RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం
- ●Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు

Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్

Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి

RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



