Baahubali: The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
పదేండ్ల తర్వాత కూడా ప్రేక్షకుల్లో బాహుబలి (Baahubali) సిరీస్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic). రీరిలిజ్‌లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
Entertainment | Published On Dec 24, 2025, 2.00 pm IST
Baahubali: The Epic OTT: డార్లింగ్ ప్రభాస్‌ను పాన్ ఇండియా హీరోగా మార్చిన సినిమా, తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన మూవీ, దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్. ఆ రెండు భాగాలను కలిపి ఒక్కటిగా చేసి ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రెండు భాగాల్లో సుమారు 90 నిమిషాలకు పైగా సనివేశాలను తొలగించి దీనిని రూపొందించి థియేటర్లలో అక్టోబర్ 31న రిలీజ్ చేశారు.
పదేండ్ల తర్వాత కూడా ప్రేక్షకుల్లో బాహుబలి సినిమాలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. థియేటర్‌లో రిలీజ్ అయిన 55 రోజుల తర్వాత ఇప్పుడీ చిత్రం ఓటీటీ (OTT) లవర్స్‌ను పలకరించడానికి రెడీ అయింది. క్రిస్టమస్‌ను పురస్కరించుకుని డిసెంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
మొదటి రెండు భాగాల్లోని అవంతిక లవ్‌స్టోరీ, పచ్చ బొట్టేసిన పాట, ఇరుక్కుపో, కన్నా నిదురించరా పాటలను, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించి 3 గంటల 43 నిమిషాల నిడివితో ‘ఎపిక్’ను రూపొందించారు. అయితే ఇప్పుడు ఓటీటీలో వీటిని యాడ్ చేస్తారేమో చూడాలి. సో రెడీ టూ వాచ్..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






