Amitabh Bachchan | షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం
Amitabh Bachchan | బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) షూటింగ్‌లో గాయపడ్డారు. కేబీసీకి (KBC) బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Entertainment | Published On Oct 1, 2026, 11.45 am IST
Amitabh Bachchan | త్రినేత్ర న్యూస్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) షూటింగ్‌లో గాయపడ్డారు. కేబీసీకి (KBC) బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 18వ సీజన్ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన షూటింగ్‌లో తాను జారి పడ్డానని స్వయంగా వెల్లడించారు. దీంతో తన మోకాలికి గాయమైందని చెప్పారు.
దీంతో ఎప్పటిలా నిల్చొని కాకుండా ఈ సారి కూర్చొనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాధారణంగా ఆయన KBC ప్రారంభంలో స్టేజ్ మధ్యలో నిల్చొని కంటెస్టెంట్‌లకు ఆయన స్వాగతం పలుకుతారు. అయితే తన మోకాలికి గాయం కావడంతో నిలబడటానికి కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని ప్రేక్షకులకు చెప్పారు. అయితే పోటీదారులను ఆహ్వానించడానికి తాను సీట్ వద్దే నిలబడతాన వెల్లడించారు. అభిమానులు ఎవరూ తన గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
83 ఏండ్ల వయసులోనూ..
బిగ్ బీ వయసు ప్రస్తుతం 83 ఏండ్లు. అయినా ఏమాత్రం తీరక లేకుండా వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తున్నారు. ఇటీవలే ‘సెక్షన్ 84’తో (Section 84) ప్రేక్షకులను పలకరించిన ఆయన.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కల్కి’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలో అమితాబ్ అశ్వథామ (Ashwatthama) క్యారెక్టర్‌లో నటిస్టున్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్ వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే – కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే
సెప్టెంబర్ 25, 2026

Telugu OTT | ఓటీటీలోకి నివేదా పేతురాజ్ రీఎంట్రీ తెలుగు మూవీ – నో డైలాగ్స్ – సినిమా మొత్తం పాటలే!
జులై 6, 2026

Alia Bhatt | ప్రభాస్ కల్కి 2లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ – దీపికా పడుకోణ్ ప్లేస్‌లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ?
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●RaviTeja | రవితేజ "తులాభారం" - క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ
- ●PHD Student Murdered | కోకాపేట్లో పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య
- ●PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
- ●Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది
- ●GST Collections | సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.04 లక్షల కోట్లు.. 14.7 శాతం వృద్ధి..
- ●Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

RaviTeja | రవితేజ "తులాభారం" - క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ

PHD Student Murdered | కోకాపేట్లో పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య

PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ

Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది



