త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

70th Filmfare Awards | త‌గ్గేదేలే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌.. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో పుష్పా 2 హ‌వా

70th Filmfare Awards | ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్పా 2 చిత్రం (Pushpa 2) స‌త్తా చాటింది. ఉత్త‌మ న‌టుడు, బెస్ట్ మూవీ, ఉత్త‌మ డైరెక్ట‌ర్ స‌హా ఐదు అవార్డులు ద‌క్కించుకుంది. దీంతో 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

G

Entertainment | Published On Feb 22, 2026, 7.46 am IST

70th Filmfare Awards | త‌గ్గేదేలే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌.. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో పుష్పా 2 హ‌వా
Advertisement

70th Filmfare Awards | త్రినేత్ర‌.న్యూస్‌: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్పా 2 చిత్రం (Pushpa 2) స‌త్తా చాటింది. ఉత్త‌మ న‌టుడు, బెస్ట్ మూవీ, ఉత్త‌మ డైరెక్ట‌ర్ స‌హా ఐదు అవార్డులు ద‌క్కించుకుంది. దీంతో 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. 70వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ వేడుక (70th Filmfare Awards) కేరళలోని కొచ్చిలో శ‌నివారం రాత్రి అంగ‌ర‌గ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ద‌క్ష‌ణాది సినీ తార‌లు అంతా హ‌జ‌రయ్యారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాక‌తో అక్క‌డ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. సాన్యా మ‌ల్హోత్రా, నిధి అగ‌ర్వాల్‌, అప‌ర్ణా బాల‌ముర‌లి, ప్ర‌ణీతా సుభాష్ త‌దిత‌రులు త‌మ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆహుతుల‌ను ఆక‌ట్టుకున్నారు.

2024లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ తెలుగు, తమిళ‌, మలయాళ, కన్నడ సినిమాల్లో ఉత్త‌మ చిత్రాల‌కు, టెక్నీషియ‌న్ల‌కు పురస్కారాలు అంద‌జేశారు. తెలుగులో ఉత్త‌మ చిత్రం పుష్పా 2, ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్‌, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా సుకుమార్‌, ఉత్త‌మ చిత్రంగా (క్రిటిక్స్‌) ల‌క్కీ భాస్క‌ర్‌, ఉత్త‌మ న‌టిగా నివేథా థామ‌స్ అవార్డులు అందుకున్నారు.

పుష్పా 2 సినిమాకు ఉత్త‌మ చిత్రం, బెస్ట్ యాక్ట‌ర్‌తోపాటు, ఉత్త‌మ డైరెక్ట‌ర్‌, బెస్ట్ మ్యూజిక్ ఆల్బ‌మ్, బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ అవార్డులు వ‌చ్చాయి. ఇక బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD) ఉత్తమ సహాయ నటుడిగా, తేజ సజ్జ (హను-మాన్), కాజల్ అగర్వాల్ (సత్యభామ) క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటీనటులుగా అవార్డులు గెలుచుకున్నారు. త‌మిళంలో అమ‌ర‌న్ సినిమా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ను కొల్ల‌గొట్టింది. ఉత్త‌మ చిత్రం, బెస్ట్ డైరెక్ట‌ర్, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ గాయ‌కుడు, ఉత్త‌మ గాయ‌ని, బెస్ట్ మ్యూజిక్‌, బెస్ట్ కొరియోగ్ర‌ఫీ విభాగాల్లో అవార్డులు ద‌క్కించుకున్న‌ది.

బ‌న్నీ రికార్డ్‌..

త‌న న‌ట‌న‌, డ్యాన్సుల‌తో అల్లు అర్జున్ దూసుకెళ్తున్నారు. పుష్పా2లో న‌ట‌న‌కుగాను 70వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్ అవార్డ్స్-2026లో ఉత్తమ నటుడు పురష్కారాన్ని అందుకున్నాడు. దీంతో 7 ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారాలు ఉన్న టాలీవుడ్ హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు. గతంలో పరుగు, వేదం, రేసు గుర్రం (క్రిటిక్స్), రుద్రమదేవి (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్), సరైనోడు, పుష్ప: ది రైజ్ సినిమాలకు ఆయన ఫిలిం ఫేర్స్ అందుకున్నాడు. బ‌న్నీ కన్నా ముందు అత్య‌ధిక అవార్డులు అందుకున్న జాబితాలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డుతో కలుపుకొని చిరు 9 ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారాలు ఉన్న హీరోగా నిలిచారు.

అవార్డుల జాబితా..

ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)

ఉత్తమచిత్రం (క్రిటిక్స్): ల‌క్కీ భాస్క‌ర్‌
ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్‌ (సత్యభామ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జ (హను-మాన్)

బెస్ట్ డెబ్యూ మేల్: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డెబ్యూఫిమేల్:నయన్ సారిక (గం గం గణేశ)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యాధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి- గుంటూరు కారం)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)

బెస్ట్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)
బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్‌ ( కుర్చీ మడతపెట్టి - గుంటూరు కారం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2: ది రూల్), నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)

Advertisement
Advertisement