Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..
Rukmini Vasanth | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC17’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కీలక నటీనటుల ఎంపిక పూర్తి కాగా, తాజాగా హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్( Rukmini Vasanth )నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Entertainment | Published On Aug 6, 2026, 4.23 pm IST
Rukmini Vasanth | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC17’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కీలక నటీనటుల ఎంపిక పూర్తి కాగా, తాజాగా హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్( Rukmini Vasanth )నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది రుక్మిణి వసంత్( Rukmini Vasanth ). ఎన్టీఆర్ సరసన డ్రాగన్ సినిమాలో నటిస్తోంది. ఆమె చేసిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు చరణ్-సుక్కూ సినిమా ఆఫర్ కూడా ఆమెను వరించేలా ఉంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే ఈ చిత్రంలో కూడా అలాంటి క్యారెక్టర్ ఉంది. దీని కోసం రుక్మిణి వసంత్‌తో పాటు మరో హీరోయిన్ పేరు కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా ఎవ్వర్నీ ఫైనల్ చేయలేదని సమాచారం.
రామ్ చరణ్‌పై తనకున్న అభిమానాన్ని గతంలోనే వెల్లడించింది రుక్మిణి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అని తెలిపింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే చరణ్-రుక్మిణి కాంబో దాదాపు ఫైనల్.
తాజావార్తలు
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్






