Mouni Roy | విడాకుల దిశగా యంగ్ హీరోయిన్ – భర్తను అన్‌ఫాలో చేసిన విశ్వంభర బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ విడాకులు తీసుకోబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. భర్త సూరజ్ నంబియార్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడమే కాకుండా అతడిని అన్‌ఫాలో చేసింది. చిరంజీవి విశ్వంభరతో మౌనీరాయ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
Entertainment | Published On May 12, 2026, 5.45 pm IST
Mouni Roy | బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది మౌనీరాయ్. కేజీఎఫ్ 2, రన్, లవ్ సెక్స్ ఔర్ దోఖా 2తో పాటు పలు సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో తన గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంది. టీవీ సీరియల్ యాక్టర్‌గా మౌనీరాయ్ కెరీర్ మొదలైంది. ఒకానొక దశలో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న టీవీ యాక్టర్‌గా నిలిచింది.
విడాకులతో వార్తల్లో ...
తాజాగా మౌనీరాయ్ వార్తల్లో నిలిచింది. అయితే సినిమాలతో కాదు..భర్త సూరజ్ నంబియార్ నుంచి ఈ బ్యూటీ విడాకులు తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలైనట్లు, విడిపోనున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ రూమర్ల నడుమ భర్తతో కలిసి దిగిన ఫొటోలన్నింటిని సోషల్ మీడియా నుంచి మౌనీరాయ్ డిలేట్ చేసింది. అంతే కాకుండా సూరజ్‌ను అన్‌ఫాలో కూడా చేసింది. సెలిబ్రిటీలు విడాకులు తీసుకొనే ముందు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం కామన్. చాలా జంటలు ఇలాగే చేశాయి. ఇప్పడు మౌనీరాయ్ కూడా భర్తను అన్‌ఫాలో చేయడంతో విడాకులు తీసుకోవడం కన్ఫామ్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ విడాకుల రూమర్లపై మాత్రం మౌనీరాయ్ రియాక్ట్ కాలేదు.
గోవాలో పెళ్లి...
సూరజ్ నంబియార్ మలయాళీ. కానీ దుబాయ్‌లో సెటిలయ్యారు. వ్యాపారవేత్త అయిన సూరజ్‌తో మౌనీరాయ్‌కి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2022లో మలయాళీ, బెంగాళీ పద్దతుల్లో పెళ్లిచేసుకున్నారు. పెళ్లికి ముందు మూడేళ్లు ప్రేమలో ఉన్నారు. వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. సూరజ్ కూడా పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడాని టాక్.
చిరంజీవి విశ్వంభరలో...
త్వరలోనే మౌనీరాయ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చిరంజీవి విశ్వంభరలో స్పెషల్ సాంగ్ చేసింది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషియో ఫాంటసీగా రూపొందిన విశ్వంభర మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



