Mouni Roy | నా గర్ల్‌ఫ్రెండ్స్ చాలా బెస్ట్ – లెస్బియన్ రూమర్లపై బాలీవుడ్ హీరోయిన్ ఫన్నీ రియాక్షన్
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ లెస్బియన్ అంటూ చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. తన కెరీర్ గురించి విన్న అతి విచిత్రమైన రూమర్ అదేనని అన్నది.
Entertainment | Published On Jun 14, 2026, 3.07 pm IST
Mouni Roy | బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ ఇటీవలే భర్త సూరజ్ నంబియార్ నుంచి విడిపోయింది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి విడాకులతో ముగింపు పలికింది. విడాకులకు మౌనీరాయ్ కారణమంటూ విమర్శలు వస్తోన్నాయి. బాలీవుడ్‌లో మౌనీరాయ్ బెస్ట్ ఫ్రెండ్స్‌లో దిశా పటానీ ఒకరు. ఆమెతో కలిసి టూర్లు, షికార్లకు వెళ్లిన ఫొటోలను పలుమార్లు సోషల్ మీడియాలో మౌనీరాయ్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో వీరిద్దరి క్లోజ్‌గా కనిపించిన తీరుపై విమర్శలు వచ్చాయి. మౌనీరాయ్, దిశా పటానీ లెస్బియన్స్ అంటూ ప్రచారం జరిగింది. హోమో సెక్సువల్ కావడంతోనే భర్త సూరజ్ నంబియార్ ఈ బాలీవుడ్ హీరోయిన్‌కు విడాకులు ఇచ్చాడని అన్నారు.
అదంతా అబద్దమే...
ఈ పుకార్లపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్‌లో మీపై వచ్చిన అతి పెద్ద రూమర్ ఏది అని అడగ్గా..."నాపై గే అనే ముద్ర వేశారు. నేను విన్న అతి విచిత్రమైన రూమర్ అదే" అని చెప్పింది. "ఆ పుకారు ఎలా వచ్చిందో...ఎవరూ ఆ విధంగా ప్రచారం చేశారో తెలియదు. కానీ అదంతా అవాస్తవమే. నా గర్ల్ ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోలను చూసి చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఇద్దరు క్లోజ్‌గా కనిపించగానే వారిపై ఓ అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు" అని మౌనీ రాయ్ అన్నది.
వారే బెస్ట్....
తన గర్ల్‌ఫ్రెండ్స్ ప్రపంచంలోనే బెస్ట్ అంటూ స్నేహితులపై ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. " విడాకుల తర్వాత జీవితం మొత్తం శూన్యంలా అనిపించింది. ఎటు అడుగులు వేయాలో అర్థం కాలేదు. ఆ కష్టకాలంలో స్నేహితులు నాకు అండగా నిలిచారు. కష్టాలు ఎదురవ్వగానే నన్ను వదిలిపెట్టిపోకుండా నాతోనే ఉన్నారు. అలాంటి గర్ల్‌ఫ్రెండ్స్ ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ చెప్పింది.
తెలుగులో...
చిరంజీవి విశ్వంభర సినిమాతో మౌనీరాయ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది. ఆగస్ట్‌లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు, సిరీస్‌లతో మౌనీరాయ్ బిజీగా ఉంది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | రష్మికను చుట్టుముట్టిన అభిమానులు – రక్షణగా నిలిచిన కృతి సనన్ – వీడియో వైరల్
జూన్ 14, 2026

Fifa World Cup 2026 | ఎవరీ రజిత్ దేవ్? ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియల్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించిన ఫస్ట్ ఇండియన్‌గా రికార్డ్!
జూన్ 13, 2026

Kangana Ranaut | కంగనా రనౌత్ మూవీకి ఓ టికెట్ కొంటే మరోటి ఫ్రీ – బీజేపీ ఎంపీ మూవీని పట్టించుకోని ఆడియెన్స్
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



