త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drishyam 3 Twitter Review | దృశ్యం 3 ట్విట్ట‌ర్ రివ్యూ – మోహ‌న్ లాల్ మూవీకి ఊహించ‌ని టాక్ – ఏదో అనుకుంటే?

మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన దృశ్యం 3 మూవీ గురువారం మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

N

Entertainment | Published On May 21, 2026, 12.37 pm IST

Drishyam 3 Twitter Review |  దృశ్యం 3 ట్విట్ట‌ర్ రివ్యూ – మోహ‌న్ లాల్ మూవీకి ఊహించ‌ని టాక్ – ఏదో అనుకుంటే?
Advertisement

Drishyam 3 Twitter Review | మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌, డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ కాంబినేష‌న్‌లో రూపొందిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు క‌ల్ట్ క్లాసిక్‌లుగా నిలిచాయి. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు కొన‌సాగింపుగా దృశ్యం ఫ్రాంచైజ్‌లో మూడో భాగంగా రూపొందిన‌ దృశ్యం 3 గురువారం థియేట‌ర్ల‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఈ మూడో పార్ట్‌లో మీనా, అనిస్బా హ‌స‌న్‌, ఎస్తేర్ అనిల్‌, అశా శ‌ర‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దృశ్యం 3 ఎలా ఉంది? మూడో పార్ట్‌తో మోహ‌న్‌లాల్‌, జీతూ జోసెఫ్ ఆడియెన్స్‌ను మెప్పించారా? లేదా? అంటే?

ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు....

ఐజీ కొడుకు మ‌ర్డ‌ర్ కేసు నుంచి జార్జ్‌కుట్టి త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడ‌నే అంశాల‌తో దృశ్యం ఫ్రాంచైజ్ సాగుతుంది. ఈ కేసు నేప‌థ్యంలోనే కొత్త అంశాన్ని ట‌చ్ చేస్తూ మూడో పార్ట్‌ను జీతూ జోసెఫ్ రూపొందించారు. ఐజీతో పాటు పోలీసులు వేసిన ఎత్తుల‌ను జార్జ్ కుట్టి తిప్పికొట్టే సీన్లు, ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు గ‌త సినిమాల‌కు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. అలాంటి మ‌లుపులేవి లేకుండా మూడో పార్ట్ చాలా ఫ్లాట్‌గా సాగుతుంద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఒకే పాయింట్ చుట్టూ చివ‌రి వ‌ర‌కు సినిమా సాగుతూ బోర్ కొట్టిస్తుంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

మెరుపులు మిస్‌....

మ‌ర్డ‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ బ్యాలెన్స్ చేస్తూ త‌న స్క్రీన్‌ప్లేతో గ‌త సినిమాల్లో స‌స్పెన్స్‌, టెన్ష‌న్ బిల్డ్ చేశారు జీతూ జోసెఫ్‌. ఆ మెరుపులేవి మూడో పార్ట్‌లో క‌నిపించ‌వ‌ని చెబుతున్నారు. దృశ్యం 3తో ఈ ఫ్రాంచైజ్‌ను ఎండ్ చేస్తే బెట‌ర్ అని కామెంట్లు పెడుతున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ పూర్తిగా తేలిపోయింద‌ని అంటున్నారు. జార్జ్ కుట్టి ఫ్యామిలీకి ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు  , వాటి నుంచి బ‌య‌ట‌ప‌డే క్ర‌మంలో అత‌డు చేసే పోరాటం ప్రెడిక్ట‌బుల్‌గా సాగుతుంద‌ని అంటున్నారు.

రిపీటెడ్ సీన్లు...

ఫ‌స్ట్ హాఫ్‌లో క‌థ అన్న‌దే లేకుండా రిపీటెడ్ సీన్ల‌తో సినిమా సాగుతుంద‌ట‌. సెకండాఫ్ మాత్రం కాస్తంత బెట‌ర్ అని చెబుతున్నారు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ తో పాటు కొన్ని సీన్లు మాత్రం ప‌ర్వాలేద‌నిపిస్తాయ‌ని అంటున్నారు. జీతూ జోసెఫ్ రైటింగ్‌, డైరెక్ష‌న్‌లో కొత్త‌ద‌నం మిస్స‌య్యింద‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. దృశ్యం ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన వీక్ మూవీ ఇదేన‌ని చెబుతున్నారు.

లిమిటెడ్ బ‌డ్జెట్‌....

జార్జ్ కుట్టి పాత్ర‌లో మోహ‌న్‌లాల్ మాత్రం మ‌రోసారి అద‌ర‌గొట్టాడ‌ని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మీనాతో పాటు మిగిలిన వారి న‌ట‌న కూడా ఒకే అని అంటున్నారు. లిమిటెడ్ బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించ‌డం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా చెబుతున్నారు. టెక్నిక‌ల్‌గా సినిమా బాగుంద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

 

Advertisement
Advertisement