Mohanlal | నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్
Mohanlal | తన వద్ద ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన విగ్రహాలు ఉన్నాయని ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ప్రకటించారు. మొత్తం 10 (5 జతలు) ఏనుగు దంతాలు (Elephant Tusks), వివిధ దేవతలకు సంబంధించిన 13 దంతపు విగ్రహాలు (Ivory Idols) ఉన్నాయని చెప్పారు.
Mohanlal | త్రినేత్ర.న్యూస్: తన వద్ద ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన విగ్రహాలు ఉన్నాయని ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ప్రకటించారు. మొత్తం 10 (5 జతలు) ఏనుగు దంతాలు (Elephant Tusks), అదేవిధంగా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి బాలాజీతో పాటు వివిధ దేవతలకు సంబంధించిన 13 దంతపు విగ్రహాలు (Ivory Idols) ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ వారసత్వంగా, బహుమతుల రూపంలో వచ్చాయని చెప్పారు. కేరళ అటవీ శాఖ అమలు చేస్తున్న అమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం (Amnesty Scheme) కింద ఈ వివరాలను సమర్పించారు. వన్యప్రాణి వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే కేసులో మోహన్‌లాల్‌పై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరాలను వెల్లడించారు.
2011 డిసెంబర్ 21న ఈ కేసు (Mohanlal Elephant Tusk Case) వెలుగులోకి వచ్చింది. 2012లో ఐటీ అధికారులు కొచ్చిలోని తేవరలో ఉన్న మోహన్ లాల్ ( ) నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు జతల ఏనుగు దంతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్రమంగా సేకరించినట్లు తేలడంతో వణ్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన కింద అటవీ శాఖ 2012లో కేసు నమోదుచేసింది. అయితే 2016లో ఏనుగు దంతాలను చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, తనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆయనకు యాజమాన్య ధృవీకరణ పత్రాలను (Ownership Certificates) జారీ చేసింది. తద్వారా కేసును వెనక్కి తీసుకోవాలని చూసింది. అయితే పెరంబవూర్ మేజిస్ట్రేట్ కోర్టు దానిని తిరస్కరించింది. ఈ క్రమంలో ఇదే విషయమై జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్‌కే జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్‌తో కూడిన ధర్మాసనం.. 2025, అక్టోబర్ 24న ప్రభుత్వం ఇచ్చిన యాజమాన్య పత్రాలు చట్టవిరుద్ధమని రద్దుచేస్తూ తీర్పు వెలురించింది. అటవీ శాఖ ప్రక్రియలో లోపాలున్నాయని, 2015 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ అధికారిక గెజెట్‌లో ప్రచరించలేదని పేర్కొంది. కొత్తగా నోటిఫికేషన్ జారీచేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
దీంతో కేరళ సర్కార్ వన్ టైమ్ అమ్నెస్టీ (క్షమా భిక్ష) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే మోహన్‌లాల్ తన వద్ద ఉన్న దంతపు వస్తువులను ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ అమ్నెస్టీ పథకంపై కూడా న్యాయపరమైన వివాదం కొనసాగుతున్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●OTT | సెన్సార్ నుంచి 127 కట్స్ - ఓటీటీలో బ్యాన్ - వివాదాస్పద సినిమా సత్లుజ్ కథ ఏంటి?
- ●PM Modi Tour's | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని
- ●Heavy rain | ముంబైలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు... ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత.. రైలు సర్వీసులు రద్దు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
- ●England vs Mexico | మెక్సికోపై ఇంగ్లండ్ విజయం
- ●SEBI | సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..

OTT | సెన్సార్ నుంచి 127 కట్స్ - ఓటీటీలో బ్యాన్ - వివాదాస్పద సినిమా సత్లుజ్ కథ ఏంటి?

PM Modi Tour's | మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని

Heavy rain | ముంబైలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు... ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత.. రైలు సర్వీసులు రద్దు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..






