SEBI | సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
SEBI | స్టాక్ మార్కెట్లలో కీలకమార్పులకు దారి తీసేలా సెబీ మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్చేంజ్‌ల ద్వారా జరిగే ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లను మళ్లీ అనుమతిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో ఈ విధానాన్ని దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించిన సెబీ, ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
SEBI | స్టాక్ మార్కెట్లలో కీలకమార్పులకు దారి తీసేలా సెబీ మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్చేంజ్‌ల ద్వారా జరిగే ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లను మళ్లీ అనుమతిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో ఈ విధానాన్ని దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించిన సెబీ, ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో కంపెనీలకు మరింత సౌలభ్యం లభించనుండగా, ఇన్వెస్టర్లకు కూడా తమ షేర్లను విక్రయించేందుకు మరో అవకాశం లభ్యం కానుంది. షేర్ బైబ్యాక్ అంటే లిస్టెడ్ కంపెనీ తన ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేయడం. కంపెనీ కొనుగోలు చేసిన ఈ షేర్లను సాధారణంగా రద్దు చేస్తుంది. దీంతో మార్కెట్‌లో ఉన్న మొత్తం షేర్ల సంఖ్య తగ్గుతుంది.
అందుకనే మళ్లీ అనుమతి..
ఇంతకుముందు కంపెనీలు ఓపెన్ మార్కెట్ ద్వారా సెకండరీ మార్కెట్‌లో నుంచి దశలవారీగా తమ షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అయితే పన్నుల విధానంలో ఉన్న తేడాలు, బైబ్యాక్‌లో పాల్గొనే, పాల్గొనని షేర్‌హోల్డర్ల మధ్య అసమానతలు వంటి కారణాలతో ఈ విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. తర్వాత బైబ్యాక్‌లపై పన్ను విధానంలో మార్పులు చేసి, ఒకే విధమైన పన్ను వ్యవస్థను అమలు చేసిన నేపథ్యంలో, టెండర్ ఆఫర్ విధానంతోపాటు ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లను కూడా ప్రత్యామ్నాయ మార్గంగా సెబీ మళ్లీ అనుమతించింది. దీని ద్వారా కంపెనీల ఖర్చులు తగ్గడం, బైబ్యాక్ ప్రక్రియ వేగంగా పూర్తికావడం, మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో షేర్ ధరలకు మద్దతు లభించడం, మూలధనాన్ని సమర్థవంతంగా వినియోగించే అవకాశం లభిస్తాయి.
కొనుగోలు ఎలా ఉంటుంది..
టెండర్ ఆఫర్ విధానంలో షేర్‌హోల్డర్లు నిర్ణయించిన ధరకు తమ షేర్లను కంపెనీకి విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లో కంపెనీ సాధారణ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారానే షేర్లను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రక్రియలో కంపెనీ ముందుగా బైబ్యాక్‌ను ప్రకటించి, గరిష్టంగా ఎన్ని షేర్లు లేదా ఎంత మొత్తానికి కొనుగోలు చేయాలనుకుంటుందో, అలాగే బైబ్యాక్ కార్యక్రమం ఎంతకాలం కొనసాగుతుందో వెల్లడిస్తుంది. సంబంధిత కంపెనీ షేర్లను కలిగి ఉన్న ప్రతి ఇన్వెస్టర్ ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లో పాల్గొనవచ్చు. అయితే కంపెనీ తప్పనిసరిగా ఒకరి షేర్లనే కొనుగోలు చేస్తుందనే హామీ ఉండదు. ఎందుకంటే ఈ కొనుగోళ్లు సాధారణ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా జరుగుతాయి. అందువల్ల ఒకరి విక్రయ ఆర్డర్‌కు కంపెనీ లేదా మరే ఇతర మార్కెట్ పార్టిసిపెంట్ కొనుగోలు ఆర్డర్ సరిపోతే మాత్రమే ట్రేడ్ పూర్తవుతుంది.
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
జులై 10, 2026

Stock Markets | భారీ పతనం అనంతరం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, తగ్గిన చమురు ధరలు..
జులై 9, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఊరట.. భారీ పతనం తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



