త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drishyam 3 | మోహ‌న్‌లాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ …. దృశ్యం 3 పోస్ట్‌పోన్‌

మోహ‌న్‌లాల్ మోస్ట్ అవైటెడ్ మలయాళం మూవీ దృశ్యం 3 పోస్ట్‌పోన్ అయ్యింది. ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు సోమ‌వారం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Mar 23, 2026, 7.56 pm IST

Drishyam 3 | మోహ‌న్‌లాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ …. దృశ్యం 3 పోస్ట్‌పోన్‌
Advertisement

Drishyam 3 : ద‌క్షిణాది ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దృశ్యం 3 ఒక‌టి. మోహ‌న్‌లాల్‌, జీతూ జోసెఫ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్2న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమాను వాయిదావేస్తున్న‌ట్లు మేక‌ర్స్ సోమ‌వారం ప్ర‌క‌టించి షాకిచ్చారు. దృశ్యం 3 పోస్ట్‌పోన్ అయిన‌ట్లుగా ట్విట్ట‌ర్ ద్వారా మోహ‌న్‌లాల్ స్వ‌యంగా వెల్ల‌డించారు.. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశాడు. ఏప్రిల్ 2న కాకుండా మే 21న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు మోహ‌న్‌లాల్ పేర్కొన్నారు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

గ‌ల్ఫ్ దేశాల్లో సంక్షోభం...

గ‌ల్ఫ్ దేశాల్లో ఏర్ప‌డిన సంక్షోభం కార‌ణంగానే ఈ సినిమా పోస్ట్‌పోన్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దృశ్యం 3 మూవీకి జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అన్సిబ హ‌స‌న్‌, ఎస్తేర్ అనిల్‌, ఆశా శ‌ర‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దృశ్యం ఫ్రాంచైజ్‌లో వ‌స్తోన్న మూడో మూవీ ఇది. తొలి రెండు భాగాలు పెద్ద హిట్ట‌య్యాయి. దాంతో దృశ్యం 3పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ట్రెండ్ సెట్ట‌ర్‌...

2013లో దృశ్యం పార్ట్ వ‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మ‌ల‌యాళంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారిపోయింది. మోహ‌న్‌లాల్ యాక్టింగ్‌, జీతూ జోస‌ఫ్ రాసిన ట్విస్ట్‌ల‌కు ఆడియెన్స్ థ్రిల్లింగ్‌గా ఫీల‌య్యారు. దృశ్యం మూవీ తెలుగుతో పాటు అనేక భాష‌ల్లోకి రీమేక్ అయ్యింది. ఆ త‌ర్వాత దృశ్యం సినిమాకు కొన‌సాగింపుగా దృశ్యం 2ను రూపొందించారు జీతూ జోసెఫ్. కొవిడ్ కార‌ణంగా సెకండ్ పార్ట్ మాత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది.

వెంక‌టేష్ రీమేక్‌...

దృశ్యం, దృశ్యం 2 సినిమాలు అదే పేరుతో తెలుగులోకి రీమేక్ అయ్యాయి. ఈ రీమేక్‌ల‌లో వెంక‌టేష్ హీరోగా న‌టించాడు. దృశ్యం 3 కూడా తెలుగులోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
ఓ మ‌ర్డ‌ర్ కేసు నుంచి సాధార‌ణ కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? పోలీసులు వేసిన ఎత్తుల‌ను ఎలా తిప్పికొట్టాడ‌నే పాయింట్‌తో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సాగాయి. ఈ రెండు పార్ట్‌ల‌కు కొన‌సాగింపుగానే దృశ్యం 3 ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement