Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ – స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు
బిగ్‌బాస్ మలయాళం షోలో ఇద్దరి కంటెస్టెంట్స్ ప్రేమాయణం కాస్త వివాదానికి దారితీసింది. ఇటీవల నటుడు సంతోష్ రాజ్‌కు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నేహా ఫాతిమా బిగ్‌బాస్ షోలో లైవ్‌లో లవ్ ప్రపోజ్ చేసింది. హిందూ మతానికి చెందినిక సంతోష్‌ను తమ కూతురు ప్రేమించడంపై నేహా ఫాతిమా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. షో నుంచి తమ కూతురిని ఇంటికి పంపించేయాలంటూ హోస్ట్ మోహన్‌లాల్‌ను కోరారు.
Entertainment | Published On Nov 1, 2026, 6.00 pm IST
Bigg Boss |మలయాళ బిగ్‌బాస్ షోలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హిందూ మతానికి చెందిన కంటెస్టెంట్‌కు ముస్లిం అమ్మాయి అయిన మరో కంటెస్టెంట్ ఐ లవ్ యూ చెప్పింది. ముస్లిం కంటెస్టెంట్ తల్లిదండ్రులు బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటరై తమ కూతురిని షో నుంచి పంపించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మోహన్‌లాల్
ప్రస్తుతం మలయాళంలో బిగ్‌బాస్ సీజన్ 8 టెలికాస్ట్ అవుతోంది. ఈ రియాలిటీ షోకు మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. బిగ్‌బాస్ సీజన్ 8కు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నేహా ఫాతిమా, నటుడు సంతోష్ రాజ్ (తషీరాజ్) లవ్‌స్టోరీ హైలైట్‌గా నిలుస్తోంది. ఇటీవలే సంతోష్ అంటే తనకు ఇష్టమని చెప్పిన నేహా ఫాతిమా లైవ్‌లో అతడికి ఐ లవ్ యూ కూడా చెప్పింది. ఈ ఎపిసోడ్ వైరల్ అయ్యింది.
కన్నీళ్లు...
ఈ లవ్‌స్టోరీపై నేహా ఫాతిమా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీకెండ్ ఎపిసోడ్‌కు వారు అటెండ్ అయ్యారు. మోహన్‌లాల్‌తో కలిసి వారు స్టేజ్‌పై కనిపించారు. నేహాను తమతో పాటు పంపించాలని కోరారు. కూతురితో మాట్లాడారు. బిగ్‌బాస్‌ను వదిలిపెట్టి వచ్చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురిని ప్రాధేయపడ్డారు. ఇతరులు తమ అవసరాలు, ఆట, ఎమోషన్స్ కోసం నిన్ను వాడుకుంటున్నారంటూ కూతురిపై ఫైర్ అయ్యారు. తల్లిదండ్రుల మాటలతో నేహా కూడా ఎమోషనల్ అయ్యింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్లు...
కూతురు ప్రేమ విషయంలోనే నేహా తల్లిదండ్రులు హర్టయినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. హిందూ మతానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానంటూ లైవ్‌లో కూతురు చెప్పడంతోనే ఆమెను బిగ్‌బాస్ నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో బిగ్‌బాస్ ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతోన్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం బిగ్‌బాస్ మలయాళం షో టీఆర్‌పీ రేటింగ్ పెంచడానికి చేసిన ఫేక్ డ్రామా ఇదని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ – ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్
అక్టోబర్ 6, 2026

Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ – యాక్షన్ విత్ వయలెన్స్ – రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్
అక్టోబర్ 5, 2026

Fifa World Cup Final | ఫిఫా ఫైనల్లో సెలబ్రిటీల సందడి.. స్టేడియంలోనే హాలీవుడ్ హీరో రొమాన్స్ – లిప్‌లాక్ ఫొటో వైరల్
జులై 20, 2026
తాజావార్తలు
- ●Grandparents' Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!
- ●TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!
- ●Rahul Gandhi Ramlila Maidan Speech | జ్ఞానేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయం.. తర్వాత మోదీ నీ వంతే!
- ●Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్
- ●November Weather | నవంబర్‌లో భానుడి భగభగలే
- ●Gajakesari Raja Yoga | నవంబర్ 3న గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు ఆర్థికంగా అన్నీ లాభాలే..!

Grandparents' Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!

TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!

Rahul Gandhi Ramlila Maidan Speech | జ్ఞానేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయం.. తర్వాత మోదీ నీ వంతే!

Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్



