Mohan Lal | ఓటీటీలో పెద్ద హిట్ – థియేటర్లలో ఎపిక్ డిజాస్టర్ – మోహన్‌లాల్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్
దృశ్యం 3 రిలీజ్ ముంగిట మోహన్‌లాల్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. ఇటీవలే మేకర్స్ దృశ్యం 2 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. కేవలం ఐదు లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టిన ఈ మూవీ ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On Apr 14, 2026, 5.25 pm IST
Mohan Lal | దృశ్యం 3 రిలీజ్ ముంగిట మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్‌కు పెద్ద షాక్ తగిలింది. దృశ్యం 3 సినిమాపై హైప్‌ను పెంచేందుకు మేకర్స్ ఇటీవలే దృశ్యం 2 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 10న మలయాళ వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీ రిలీజ్ కోసం నిర్మాతలు భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ దృశ్యం 2 ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ రీ రిలీజ్ కోసం మేకర్స్ పెట్టిన ఖర్చులు కూడా రాబట్టలేకపోయింది. కేవలం ఐదు లక్షల కలెక్షన్స్‌తో దారుణంగా నిరాశపరచడం మలయాళ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మోహన్‌లాల్ క్రేజ్‌తో పాటు దృశ్యం ఫ్రాంచైజ్‌పై ఉన్న బజ్ ఈ రీ రిలీజ్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు.
ఓటీటీలో...
దృశ్యం 2 సినిమా థియేటర్లలో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. లాక్‌డౌన్ కారణంగా మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ మర్డర్ మిస్టరీ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో హయ్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న మలయాళ సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
రికార్డులు అనుకుంటే...
ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా మొదటిసారి థియేటర్లలో రిలీజ్ కానుండటంతో కలెక్షన్స్ భారీగానే వస్తాయని మేకర్స్ అంచనా వేశారు. దృశ్యం 3 సినిమాపై ఉన్న హైప్ కూడా ఈ సినిమాకు కలిసివస్తుందని అనుకున్నారు. కానీ వారు ఒకటి ఊహిస్తే రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది. ఐదు లక్షల వసూళ్లతో భారీగా నష్టాలను మిగిల్చింది.
జార్జ్ కుట్టి పోరాటం...
దృశ్యం, దృశ్యం 2 సినిమాలకు కొనసాగింపుగా దృశ్యం 3 రాబోతుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ మే 21న రిలీజ్అవుతోంది. ఐజీ గీతా ప్రభాకర్ నుంచి జార్జ్ కుట్టి తో పాటు అతడి కుటుంబానికి మరో ఆపద వస్తుంది? అదేమిటి? మరోసారి తన తెలివితేటలతో జార్జ్ కుట్టి గీతా ప్రభాకర్‌ను ఎలా దెబ్బకొట్టానే పాయింట్‌తో దృశ్యం 3 రూపొందుతోంది. దృశ్యం 3 మూవీలో మీనా, ఆశా శరత్, ఎస్తేర్ అనిల్, అనిస్బా హసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






