Mla Raja Singh | అశ్లీలత, అసభ్యత తప్ప కథ లేదు – యశ్ టాక్సిక్‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్
యశ్ టాక్సిక్‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం, మితిమీరిన హింసతో ఈ సినిమాను రూపొందించారని అన్నాడు. సినిమాలో మహిళలను చాలా అసభ్యంగా చూపించారని రాజాసింగ్ పేర్కొన్నారు. టాక్సిక్‌పై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Aug 30, 2026, 6.29 pm IST
Mla Raja Singh | యశ్ టాక్సిక్ మూవీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది.ఇందులో హింస, రక్తపాతం ఎక్కువగా ఉందంటూ విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. తాజాగా టాక్సిక్‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం, మితిమీరిన వయలెన్స్‌తో పాటు మహిళలను అసభ్యంగా చూపించారని అన్నాడు. "టాక్సిక్ మొత్తం అశ్లీలతతో నిండిపోయింది. సినిమాలు సమాజానికి మంచి మెసేజ్‌ను ఇచ్చేలా ఉండాలి. కానీ టాక్సిక్ చాలా అసభ్యంగా ఉంది. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథ, సన్నివేశాలు ఉన్నాయి. కార్యకర్తలు, స్నేహితులతో కలిసి ఈ సినిమా చూడటానికి వెళ్లాను. అందులోని డైలాగ్స్, అశ్లీల సీన్స్ చూడలేక సినిమా మొదలైన కొద్ది సేపటికే థియేటర్ నుంచి బయటకు వచ్చాను. టాక్సిక్‌లాంటి సినిమాల వల్ల హీరో యశ్‌కు చెడ్డ పేరు వస్తుంది" అని రాజా సింగ్ అన్నారు.
కథే లేదు...
"కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 యశ్‌కు మంచి పేరుతో పాటు డబ్బులు వచ్చాయి. అదే స్టైల్‌లో టాక్సిక్ తీశాడు. అసలు ఈ సినిమాలో కథే లేదు. ఫ్యామిలీతో సినిమా చూడటానికి ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు కుటుంబ విలువలతో కూడిన మంచి కథలతో సినిమాలు వచ్చేవి. విలువల గురించి చెప్పేవారు. ఇప్పుడు డబ్బులు, డ్రగ్స్, చంపడం లాంటి వాటినే చూపిస్తున్నారు. ఇలాంటి కథలతో సినిమాలు చేసే విషయంలో హీరోలు, దర్శకులు ఆలోచించాలి" అని రాజా సింగ్ అన్నారు.
ఇరుముడిపై ప్రశంసలు...
టాక్సిక్‌ను విమర్శించిన రాజాసింగ్ రవితేజ ఇరుముడిపై ప్రశంసలు కురిపించారు. "రవితేజ ఇరుముడిలో మంచి మెసేజ్ ఉంది. దైవిక అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించారు. ఛావా లాంటి సినిమాల్లో హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించారు. సమాజానికి ఇలాంటి సినిమాలే కావాలని" అన్నారు టాక్సిక్‌ను ఉద్దేశించి రాజా సింగ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
250 కోట్లు...
ఈ విమర్శలు, నెగెటివ్ కామెంట్లతో సంబంధం లేకుండా టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ఐదు రోజుల్లోనే ఈ సినిమాకు 250 కోట్లు వచ్చాయి. టాక్సిక్‌లో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా నటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ – తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
సెప్టెంబర్ 13, 2026

Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం – వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
సెప్టెంబర్ 13, 2026

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



