త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manasa Varanasi | మిస్ ఇండియా విన్న‌ర్స్‌కు డ‌బ్బులు ఇవ్వ‌రు – హీరోయిన్ మాన‌స వార‌ణాసి కామెంట్స్‌

మిస్ ఇండియా విన్న‌ర్ మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా నటించిన కంపుల్ ఫ్రెండ్లీ మూవీ ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రెండు లిప్‌లాక్‌లు ఉంటాయ‌ని, వాటిలో న‌టించ‌డానికి సందేహించాన‌ని మాన‌స వార‌ణాసి అన్న‌ది.

N

Entertainment | Published On Feb 12, 2026, 8.27 pm IST

Manasa Varanasi | మిస్ ఇండియా విన్న‌ర్స్‌కు డ‌బ్బులు ఇవ్వ‌రు – హీరోయిన్ మాన‌స వార‌ణాసి కామెంట్స్‌
Advertisement

Manasa Varanasi | మిస్ ఇండియా విన్న‌ర్ మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా న‌టించిన క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. దేవ‌కి నంద‌న వాసుదేవ‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాన‌న వార‌ణాసికి ఇది సెకండ్ మూవీ. లివింగ్ టుగెద‌ర్ అనే కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా గురించి, మిస్ ఇండియా జ‌ర్నీ గురించి మాన‌స వార‌ణాసి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

ముద్దు సీన్లు ఉన్నాయి...

క‌పుల్ ఫ్రెండ్లీ మూవీలో తాను మిత్ర అనే అమ్మాయిగా క‌నిపిస్తాన‌ని మాన‌స వార‌ణాసి చెప్పింది. "భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన ఓ అమ్మాయి, అబ్బాయి ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు? అన్న‌ది నాచుర‌ల్‌గా డైరెక్ట‌ర్ ఈ సినిమాలో ఆవిష్క‌రించారు. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ రెండు ముద్దు సీన్స్ ఉంటాయని డైరెక్ట‌ర్ అన్నారు. మొదట్లో లిప్‌లాక్‌ల‌లో న‌టించ‌డానికి సందేహించాను. అసభ్యంగా సీన్స్ చేయరు అని నమ్మకం టీమ్ మెంబ‌ర్స్‌పై ఉండ‌టంతో ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌డానికి ఒప్పుకున్నా" అని మాన‌స వార‌ణాసి చెప్పింది.

నో ప్రైజ్‌మ‌నీ...

"మిస్ ఇండియా విన్నర్స్‌కు భారీగా డ‌బ్బులు ఇస్తుంటార‌ని అనుకుంటారు. కానీ ప్రైజ్‌మ‌నీ ఉండ‌దు. నేను మిస్ ఇండియా పోటీలకు రెడీ అవుతున్న టైమ్ లోనే సినిమా ల్లో అవకాశాలు వచ్చాయి. మిస్ వరల్డ్ పోటీల నుంచి తిరిగి వచ్చాక సినిమాల ప‌ట్ల మ‌రింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఆడిషన్స్‌కు అటెండ్ కావ‌డం స్క్రిప్ట్స్ వినడం వంటివి చేశాను" అని మానస వారణాసి అన్నది.

ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు...

"నేను సినిమాల్లోకి వెళ‌తానంటే మొద‌ట ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వ‌చ్చాను. ఇండ‌స్ట్రీలో ఎవరిని నమ్మాలి, మనకు తెలియని ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేస్తారు..ఇలాంటి భయాలు మా కుటుంబ‌స‌భ్యుల‌కు ఉండేవి. మా వాళ్లూ ఇలాగే భయపడ్డారు. వారిని క‌న్వీన్స్ చేసి ఇండ‌స్ట్రీలోకి రావ‌డం చాలా క‌ష్ట‌మైంది. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు. కంపుల్ ఫ్రెండ్లీ ట్రైల‌ర్‌, టీజ‌ర్‌ రిలీజ్ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి ఇలా ఎలా చేశావు అంటూ కోప‌గించుకున్నారు" అని మాన‌స వార‌ణాసి తెలిపింది.

Advertisement
Advertisement