Gayatri Bhardwaj | తెలుగు మైథాలజీ మూవీలో మిస్ ఇండియా విన్నర్ – సందీప్‌కిషన్ కరికాల షురూ
మిస్ ఇండియా విన్నర్ గాయత్రి భరద్వాజ్ తెలుగు సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుంది. సందీప్‌కిషన్ హీరోగా నటిస్తోన్న కరికాల మూవీ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్‌తో పాటు కేథరిన్, సాక్షి మడోల్కర్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
Entertainment | Published On Oct 15, 2026, 4.36 pm IST
Gayatri Bhardwaj | మిస్ ఇండియా విన్నర్ తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఓ సోషియో ఫాంటసీ మూవీలో యువరాణిగా కనిపించబోతుంది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా హీరోగా వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు సందీప్ కిషన్. ఇటీవలే సిగ్మా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా సందీప్‌కిషన్ కెరీర్లో ఫస్ట్ టైమ్ సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు. కరికాల పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ రెండ్ పార్ట్‌లుగా రిలీజ్ కాబోతుంది. ఈ మైథాలజీ మూవీలో సందీప్‌కిషన్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు.
యోధుడిగా...
కరికాల మూవీ పూజా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈఓపెనింగ్ వేడుకలో నాయకానాయికలు పాల్గొన్నారు. సోషియో ఫాంటసీ మూవీలో చారిత్రక యోధుడి పాత్రలో సందీప్‌కిషన్ కనిపించబోతున్నాడు. కరికాలలో కేథరిన్, సాక్షి మడోల్కర్తో పాటు మిస్ ఇండియా గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా కనిపించబోతున్నారు.
యువరాణిగా...
కరికాలలో గాయత్రి భరద్వాజ్ యువరాణి పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. గ్లామర్‌తో పాటు యాక్షన్ ప్రధానంగా ఆమె క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. 2018లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది గాయత్రి భరద్వాజ్. యూట్యూబ్‌లో రిలీజైన ఢిండోరా వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో ఫస్ట్ టైమ్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో రవితేజ భార్యగా కనిపించింది. ఆ తర్వాత అల్లు శిరీష్ బడ్డీలో నటించింది. ప్రస్తుతం విశ్వక్సేన్ కల్ట్‌లో హీరోయిన్గా నటిస్తోన్న ఈ మిస్ ఇండియా విన్నర్..ఈ సినిమా రిలీజ్ కాకముందే కరికాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
శంబాల ఫేమ్...
రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న కరికాలకు శంబాల ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. కరికాల పార్ట్ వన్ వచ్చే ఏడాది జూలైలో...పార్ట్ 2 అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Catherine | నాలుగేళ్ల తర్వాత హీరోయిన్గా ఛాన్స్ – సోషియో ఫాంటసీ మూవీలో యువరాణిగా కేథరిన్
అక్టోబర్ 10, 2026

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ – తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
అక్టోబర్ 3, 2026

Catherine | స్పెషల్ సాంగ్‌తో జాక్‌పాట్ – హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు
- ●Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
- ●Tata Play Smart | ఇక సెట్‌టాప్ బాక్స్ అవసరం లేదు.. రూ.199కే 500కు పైగా టీవీ ఛానల్స్..
- ●Ponnam Prabhakar | చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి

BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్

Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు

Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్



