Catherine | స్పెషల్ సాంగ్‌తో జాక్‌పాట్ – హీరోయిన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్
ఏడాది గ్యాప్ తర్వాత స్పెషల్ సాంగ్‌తో కోలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది కేథరిన్. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన సిగ్మా మూవీలో ప్రత్యేక గీతంలో నటించింది. ఈ పాట కోసం కేథరిన్ భారీగానే రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఫరియా అబ్డుల్లా కంటే ఐటెంసాంగ్ చేసిన కేథరిన్ ఎక్కువ పారితోషికం అందుకుందని అంటున్నారు.
Entertainment | Published On Sep 24, 2026, 6.34 pm IST
Catherine | ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్, గ్లామర్ మాత్రమే సరిపోవు. అదృష్టం కూడా కలిసిరావాలి. కేథరిన్ అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సరైనోడు, నేనే రాజు నేను మంత్రి, ఇద్దరమ్మాయిలతో పాటు పలు సినిమాల్లో అందాలతో ఆకట్టుకుంది. చిరంజీవి, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. అయినా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయింది.
స్పెషల్ సాంగ్...
మంచి సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ సిగ్మా మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా కనిపిస్తోంది.
సులోచన...
ఈ సినిమాలో సులోచన అంటూ సాగే ఓ పాటలో సందీప్‌కిషన్‌తో కలిసి కేథరిన్ స్టెప్పులు వేసింది. ఈ మాస్ సాంగ్‌కు కేథరిన్ గ్లామర్ హైలైట్‌గా నిలవబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు. కాగా ఈ ప్రత్యేక గీతం కోసం కేథరిన్ కోటిన్నర రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. గతంలో జయజానకి నాయక సినిమాలో ఐటెంసాంగ్‌లో కేథరిన్ నటించింది. అప్పుడు అరవై లక్షల వరకు పారితోషికం స్వీకరించిన ఈ ముద్దుగుమ్మ సిగ్మా కోసం డబుల్ చేసినట్లు చెబుతున్నారు. సిగ్మాలో హీరోయిన్‌గా నటించిన ఫరియా అబ్దుల్లా కంటే స్పెషల్ సాంగ్ చేసిన కేథరిన్ ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫరియా అబ్దుల్లా ఈ సినిమా కోసం యాభై లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలిసింది.
సుదీప్ కూతురు...
సులోచన పాటను తమిళంలో అగ్ర హీరో సుదీప్ కూతురు సాన్వీ సుదీప్ ఆలపించారు. ఈ సాంగ్‌తోనే సాన్వీ సుదీప్ సింగర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో శృతి రంజని, కృష్ణచైతన్య పాడారు. ఈ స్పెషల్ సాంగ్‌తో కోలీవుడ్‌లో మళ్లీ బిజీ కావాలని కేథరిన్ కలలు కంటోంది. సిగ్మా మూవీ అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | దళపతి విజయ్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ – చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్
సెప్టెంబర్ 24, 2026

NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!
సెప్టెంబర్ 6, 2026

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ – నాలుగోసారి కాంబో రిపీట్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తమ ప్రజా సేవ అవార్డు
- ●RS Praveen Kumar | బీఆర్ఎసోళ్లవే కాదు.. రేవంత్, పొంగులేటి భూములపై కూడా విచారణ జరపాలి
- ●Driving Licence Mobile Number Update | సెప్టెంబర్ 25 లోపు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దు?
- ●KTR | కేసీఆర్‌ను ఏ 'సర్' కూడా ఓడించలేదు
- ●Sharwanand | ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ - సంక్రాంతికి థియేటర్లలోకి జార్జ్ క్రిష్
- ●Cyber Fraud WhatsApp Reply No | ఓటీపీ లేదు, లింక్ అసలే లేదు.. కేవలం 'నో' అని రిప్లై ఇస్తే రూ.1.70 లక్షలు మాయం

CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తమ ప్రజా సేవ అవార్డు

RS Praveen Kumar | బీఆర్ఎసోళ్లవే కాదు.. రేవంత్, పొంగులేటి భూములపై కూడా విచారణ జరపాలి

Driving Licence Mobile Number Update | సెప్టెంబర్ 25 లోపు డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దు?

KTR | కేసీఆర్‌ను ఏ 'సర్' కూడా ఓడించలేదు



