త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Catherine | నాలుగేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా ఛాన్స్ – సోషియో ఫాంట‌సీ మూవీలో యువ‌రాణిగా కేథ‌రిన్‌

దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా తెలుగులో ఛాన్స్ ద‌క్కించుకుంది కేథ‌రిన్‌. సోషియో ఫాంట‌సీ మూవీ క‌రికాల‌లో క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతుంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు శంబాల ఫేమ్ యుగంధ‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

N

Entertainment | Published On Oct 10, 2026, 2.18 pm IST

Catherine  | నాలుగేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా ఛాన్స్ – సోషియో ఫాంట‌సీ మూవీలో యువ‌రాణిగా కేథ‌రిన్‌
Advertisement

Catherine | గ్లామ‌ర్ బ్యూటీ కేథ‌రిన్ నాలుగేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ ద‌క్కించుకుంది. సోషియో ఫాంట‌సీ మూవీ కోసం యంగ్ హీరోతో రొమాన్స్ చేయ‌బోతుంది. సందీప్ కిష‌న్ హీరోగా శంబాల ఫేమ్ యుగంధ‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వంలో క‌రికాల పేరుతో అడ్వెంచ‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. చంద‌మామ క‌థ‌ల స్ఫూర్తితో రూపొందుతోన్న‌ ఈ సినిమాలో హీరోయిన్ క‌న్ఫామ్ అయ్యింది. సందీప్ కిష‌న్‌కు జోడీగా కేథ‌రిన్ క‌నిపించ‌బోతుంది.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌...

ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ స్పెష‌ల్‌ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో యువ‌రాణి త‌ర‌హా లుక్‌లో ఈ ముద్దుగుమ్మ‌ క‌నిపిస్తోంది. చెవి దుద్దులతో పాటు చేతిపై మిణుగురు పురుగులు వాలి ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. న్యూ బ్యూటీ...న్యూ మిస్ట‌రీ అంటూ ఈ పోస్ట‌ర్‌కు మేక‌ర్స్ క్యాప్ష‌న్ జోడించారు. క‌రికాల సినిమాలో అతీంద్రియ శ‌క్తులు క‌లిగిన యువ‌రాణిగా విభిన్నంగా కేథ‌రిన్ పాత్ర సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

స్పెష‌ల్ సాంగ్‌...

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన సిగ్మా మూవీలో కేథ‌రిన్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. తాజాగా సందీప్ కిష‌న్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

చిరంజీవి సినిమాల్లో...

దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత కేథ‌రిన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ ఇది. చిరంజీవి హీరోగా న‌టించిన మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు, వాల్తేర్ వీర‌య్య సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది. 2022లో వ‌చ్చిన క‌ళ్యాణ్ రామ్‌ బింబిసార సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించింది.

పేరు మార్చుకుంది...

వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో కేథ‌రిన్ కెరీర్ సాగుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు వ‌స్తోన్న విజ‌యాలు మాత్రం ద‌క్క‌డం లేదు. ల‌క్ కోసం త‌న పేరును మార్చుకుంది.ఇన్నాళ్లు కేథ‌రిన్ ట్రెసాగా ఉన్న ఈ బ్యూటీ కొత్త‌గా అలెగ్జాండ‌ర్ అనే అక్ష‌రాల‌ను త‌న పేరుకు యాడ్ చేసింది. కేథ‌రిన్ అలెగ్జాండ‌ర్ ట్రెసాగా మార్చుకుంది.

రెండు పార్ట్‌లు...

క‌రికాల మూవీ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతోంది. క‌రికాల ఛాప్ట‌ర్ వ‌న్ 2027 జూలై 2 రిలీజ్ కాబోతుంది...క‌రికాల పార్ట్ 2 2027 అక్టోబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సందీప్‌కిష‌న్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

 

Advertisement
Advertisement