Chiranjeevi | ముగ్గురు కలిసి రఫ్ఫాడించేశారు – పెద్ది ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ – డైలాగ్ లీక్
పెద్ది మూవీ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. రిలీజ్‌కు ముందే ఈ ట్రైలర్ చూశానని, రామ్‌చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ ముగ్గురు కలిసి రఫ్ఫాడించేశారని అన్నాడు. ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ను చిరంజీవి లీక్ చేశారు.
Entertainment | Published On May 16, 2026, 3.50 pm IST
Chiranjeevi | రామ్‌చరణ్ పెద్ది ట్రైలర్‌కు మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు. పెద్ది ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ను మెగాస్టార్ లీక్ చేశారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన పెద్ది మూవీ జూన్ 4న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరుగనుంది. కాగా రిలీజ్‌కు ముందే పెద్ది ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుందని అన్నారు.
జస్ట్ వావ్...
"పెద్ది ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్ అనిపించింది. మూడు నిమిషాలు ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్‌డ్ ట్రైలర్. రామ్‌చరణ్… బుచ్చిబాబు… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్ అన్ని నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి" అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా "అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...నేను పోరాడాను సారు" అంటూ పెద్ది ట్రైలర్‌లోని డైలాగ్ లీక్ చేశారు. ట్రైలర్ చూసాక కంట్రోల్ తప్పా అంటూ డైరెక్టర్ బుచ్చిబాబుకు సారీ చెప్పారు. చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతోంది.
శృతి హాసన్ స్సెషల్ సాంగ్...
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో పెద్ది మూవీ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెద్ది మూవీకి ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



