త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | సినిమా ఇండ‌స్ట్రీ కొంద‌రికి కాదు…అంద‌రిదీ – ర‌వితేజ ఇరుముడిపై చిరంజీవి పోస్ట్‌

ర‌వితేజ ఇరుముడిపై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించారు. సినీ ప‌రిశ్ర‌మ కొంద‌రికి కాద‌ని, అంద‌రిద‌ని, మ‌నం బ‌త‌కాలి...ఇత‌రుల‌నూ బ‌తికించాలి అంటూ గురువారం చిరంజీవి చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. చిరంజీవి పోస్ట్‌కు ర‌వితేజ రిప్లై ఇచ్చారు.

N

Entertainment | Published On Aug 27, 2026, 3.06 pm IST

Chiranjeevi | సినిమా ఇండ‌స్ట్రీ కొంద‌రికి కాదు…అంద‌రిదీ – ర‌వితేజ ఇరుముడిపై చిరంజీవి పోస్ట్‌
Advertisement

Chiranjeevi |  ర‌వితేజ ఇరుముడి మూవీ రికార్డ్ క‌లెక్ష‌న్స్‌తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏడు రోజుల్లోనే 120 కోట్లకుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. య‌శ్ టాక్సిక్ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకొని బుధ‌వారం రోజు ఇరుముడి 11 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. టాక్సిక్‌కు నెగెటివ్ టాక్ రావ‌డం ఇరుముడికి ప్ల‌స్ పాయింట్‌గా మారింది. రెండు వంద‌ల కోట్ల మార్క్‌ను ర‌వితేజ మూవీ ట‌చ్ చేసే అవ‌కాశం ఉందంటూ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

రామ్‌చ‌ర‌ణ్, ధ‌నుష్‌...

తండ్రీకూతుళ్ల బంధాన్ని హృద్యంగా ఇరుముడిలో ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ చూపించారంటూ ఆడియెన్స్‌తో పాటు సెలిబ్రిటీలు ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇరుముడి బాగుందంటూ రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మిళ హీరో ధ‌నుష్‌తో పాటు ప‌లువురు ప‌లువురు ట్వీట్స్‌, పోస్ట్‌లు పెట్టారు.
తాజాగా ఇరుముడి సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి...ర‌వితేజతో పాటు చిత్ర‌బృందంపై అభినంద‌న‌లు కురిపించారు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ర‌వితేజ న‌ట‌న అద్భుతం...

"ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు ఇరుముడి సినిమాను ఎంజాయ్ చేశా. త్రినాథ్ పాత్ర‌లో ర‌వితేజ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. త‌న భుజాల‌పై ఈ సినిమాను మోశాడు. సున్నిత‌మైన అంశాన్ని చాలా ఎమోష‌న‌ల్‌గా ఇరుముడిలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ‌. బేబీ న‌క్ష‌త్ర న‌ట‌న బాగుంది. ఆమెకు ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తు ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఇరుముడిలో భాగ‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రికి శుభాకాంక్ష‌లు. ప్ర‌తి ఒక్క‌రూ విజ‌యానికి అర్హులే" అంటూ త‌న పోస్ట్‌లో చిరంజీవి పేర్కొన్నారు." ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి" అంటూ చిరంజీవి తెలిపారు. మెగాస్టార్ ట్వీట్‌కు అన్న‌య్య థాంక్యూ అంటూ ర‌వితేజ రిప్లై ఇచ్చారు. చిరంజీవి పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

Advertisement
Advertisement