Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు – వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా – విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
తమ వ్యక్తిగత జీవితంపై వస్తోన్న విమర్శలకు రష్మిక మందన్న చెక్ పెట్టింది. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే సందడి చేశారు. ఈ షోలో తమ ప్రేమ, పెళ్లి బంధం గురించి చెప్పిన వారిద్దరు చెప్పిన విషయాలపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. వాటిపై రష్మిక సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యింది.
Entertainment | Published On Oct 26, 2026, 5.20 pm IST
Rashmika Mandanna | తన వైవాహిక జీవితంపై వస్తోన్న విమర్శలపై రష్మిక మందన్న (Rashmika Mandanna) రియాక్ట్ అయ్యారు. నిజానిజాలు తెలుసుకోకుండా అసంపూర్ణ సమాచారంతో తమ గురించి అభిప్రాయానికి రావద్దొని అన్నది . విజయ్‌పై తనకు అమితమైన ప్రేమ ఉందని, పెళ్లి తర్వాతే తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.
కాఫీ విత్ కరణ్ షో...
ఇటీవలే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నజంటగా కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఇందులో తమ లవ్‌స్టోరీ, పెళ్లితో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. ఈ షోలో విజయ్, రష్మిక వ్యక్తం చేసిన అభిప్రాయాలపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో భర్త విజయ్ దేవరకొండను రష్మిక అన్‌ఫాలో చేసిందని, ఇద్దరి మధ్య విభేదాల తలెత్తాయంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు రూమర్లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రష్మిక ఖండించింది.
కోపాన్ని చూపించాలనే...
"ప్రతి ఒక్కరికి అభిప్రాయాలను తెలిపే హక్కు ఉంటుంది. కానీ అభిప్రాయాల పేరుతో ఇతరులపై అకారణమైన ద్వేషాన్ని ప్రదర్శించడం మాత్రం సరికాదు. కాఫీ విత్ కరణ్ షోలో మేము చెప్పిన దానిని అర్థం చేసుకోవడం కంటే మమ్మల్ని తప్పుపట్టాలని, మాపై కోపాన్ని చూపించడానికే చాలా మంది ప్రయత్నించినట్లుగా అనిపించింది. మేము ఎవరం ఎన్ని సార్లు ప్రపోజ్ చేశాం. పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అంత సమయం తీసుకున్నామనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని విజయ్ అనుకున్నారు. ఒడిదుడుకులు, ఒత్తిళ్లు కలిసి ఎదుర్కోగలమో లేదో తెలుసుకున్న తర్వాతే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం" అని రష్మిక చెప్పింది.
ప్రపోజల్ మాత్రమే కాదు...
"పెళ్లి అన్నది కేవలం ప్రపోజల్ మాత్రమే కాదు. ఉంగరాలు తొడగటం, మోకాళ్లపై కూర్చొని ప్రేమను వ్యక్తం చేయడం లాంటివి కేవలం అలంకారాలు మాత్రమే. కలిసి జీవితాలను, భవిష్యత్తును నిర్మించుకోవడం పెళ్లి బంధంలో చాలా ముఖ్యం. ఆ విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నామని అనుకుంటున్నాం. విజయ్ అంటే నాకు పిచ్చి ప్రేమ. దానిని నేను తప్పుగా అనుకోవడం లేదు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ప్రేమించకపోతే...అతడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి" అని రష్మిక అన్నది.
కష్టాల్లో ఉన్నప్పుడు...
"నేను కష్టాల్లో ఉన్నప్పుడు విజయ్ నా పక్కన ఉన్నాడు. నేను బాధలో ఉన్నప్పుడు, నాకు సలహాలు, ఓదార్పు అవసరమైననప్పుడు కూడా నాతో పాటే నడిచాడు. నా వెన్నంటి నిలిచాడు. నా కోసం ఎన్ని అవరోధాలు, హద్దులు అయినా దాటే వ్యక్తి నా జీవితభాగస్వామిగా దొరకడం నా అదృష్టం. పెళ్లి తర్వాత కూడా మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం చెప్పాలనిపించే తోడు కావాలి. అలాంటి ప్రపోజల్‌ను విజయ్‌తో నేను వెయ్యి సార్లు అయినా చేస్తాను... 100 సార్లు అంటే నా దృష్టిలో చాలా తక్కువే. పెళ్లి తర్వాతే నేను చాలా సంతోషంగా ఉన్నా. ఆ ఆనందం ఇప్పటికీ నా ముఖంలో కనిపిస్తోంది. మా జీవితాలకు సంబంధించి చాలా మంది ఇంటర్నెట్‌లో ప్రచారమయ్యే అబద్దాలను నమ్ముతుండటం బాధను కలిగిస్తోంది. ఈ విమర్శలేవి తమ మధ్య ప్రేమను తగ్గించలేవు" అని చెప్పింది. రష్మిక పోస్ట్ వైరల్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Srinidhi Shetty | అమ్మ పాత్ర…అయినా “నో” చెప్పాలని అనిపించలేదు – ఆదర్శకుటుంబంపై శ్రీనిధి శెట్టి కామెంట్స్
అక్టోబర్ 26, 2026

Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైరల్
అక్టోబర్ 26, 2026

Kangana Ranut | కలిసిరాని బాలీవుడ్ – హారర్ మూవీతో టాలీవుడ్లోకి కంగనా రనౌత్ రీఎంట్రీ
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●DMK Ex Minister Corruption Case | తమిళనాడులో ప్రకంపనలు: రూ.100 కోట్ల లంచం కేసులో డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్.. 177 స్కూళ్లే టార్గెట్!
- ●Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర
- ●Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?
- ●TPCC Delhi committee | కాంగ్రెస్ ఢిల్లీ మహా ర్యాలీకి వేళాయె: రంగంలోకి టీపీసీసీ కీలక కమిటీ.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు
- ●Ponnam Prabhakar | దళారులకే ధాన్యం అమ్ముకోండి.. రైతులకు మంత్రి పొన్నం సూచన
- ●Mallavazhula Sadashivudu Memorial Awards | చమన్ సింగ్, సంగిశెట్టిలకు ‘మల్లావఝల’ అవార్డ్స్

DMK Ex Minister Corruption Case | తమిళనాడులో ప్రకంపనలు: రూ.100 కోట్ల లంచం కేసులో డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్.. 177 స్కూళ్లే టార్గెట్!

Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర

Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?

TPCC Delhi committee | కాంగ్రెస్ ఢిల్లీ మహా ర్యాలీకి వేళాయె: రంగంలోకి టీపీసీసీ కీలక కమిటీ.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు



