Supreme Court | న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
Supreme Court | డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (Digital Personal Data Protection Act 2023) చట్టం, దాని నిబంధనలు పత్రికా స్వేచ్ఛను, సమాచార హక్కు (RTI)ను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (Digital Personal Data Protection Act 2023) చట్టం, దాని నిబంధనలు పత్రికా స్వేచ్ఛను, సమాచార హక్కు (RTI)ను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ, టైమ్స్ గ్రూప్, ఇండియా టుడే, జీ, ఎన్డీటీవీ, నెట్‌వర్క్ 18 వంటి 21 ప్రముఖ వార్తా సంస్థల డిజిటల్ విభాగాలు సభ్యులుగా ఉన్న డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Chief Justice Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. DNPA తరపున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. డేటా రక్షణ చట్టంలో జర్నలిజం కార్యకలాపాలకు ఎటువంటి మినహాయింపు లేకపోవడం వార్తా సేకరణను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధనాత్మక జర్నలిజంలో (Investigative Journalism) ఎవరి గురించైనా వార్త రాయాలన్నా ప్రత్యేకించి టీవీలో లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయాలన్నా సదరు వ్యక్తి అనుమతి (Consent) తీసుకోవాలనడం జర్నలిజం మనుగడకే ప్రమాదకరమన్నారు. ఒకవేళ వారు నిరాకరిస్తే వార్తా సేకరణ, పరిశోధనాత్మక జర్నలిజం పూర్తిగా దెబ్బతింటుంది చెప్పారు. ప్రత్యేకించి టీవీ జర్నలిజంలో లైవ్ టెలివిజన్ వార్తలకు, బ్రేకింగ్ న్యూస్‌కు ముందస్తు అనుమతి కోసం ఎదురుచూడాల్సి వస్తే ప్రసారాలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీని వల్ల న్యూస్‌రూమ్‌లు మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
RTI చట్టంలోని సెక్షన్ 8(1)(j) సవరణను కూడా అసోసియేషన్ సవాల్ చేసింది. ఈ మార్పు ప్రజా అధికారులకు సంబంధించిన సమాచార లభ్యతను పరిమితం చేస్తుందని, వార్తల స్వరూపాన్నే మార్చేస్తుందని పేర్కొన్నారు. పరిశోధనలు, గణాంకాల సేకరణ వంటి వాటికి చట్టంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ, ప్రజా ప్రయోజనార్థం పనిచేసే జర్నలిజానికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తాము సిటిజన్ జర్నలిస్టులకు భిన్నమైన, సాంప్రదాయ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసే 'లెగసీ మీడియా' అని పేర్కొంటూ, జర్నలిజం కార్యకలాపాలకు ఈ చట్టం నుంచి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.
Also Read..
గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
అక్టోబర్ 27, 2026

Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు
అక్టోబర్ 27, 2026

Supreme Court | ఫామ్ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భరోసా
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం
- ●Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు
- ●Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
- ●CTI | 10 లక్షల మంది నిరసనకారులు, 20 వేల వాహనాలు.. నవంబర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి
- ●Australia Visa | ఆస్ట్రేలియా వీసా రూల్స్‌లో మార్పులు.. భారతీయులకు బయోమెట్రిక్స్ తప్పనిసరి..
- ●Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు

Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం

Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు

Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

CTI | 10 లక్షల మంది నిరసనకారులు, 20 వేల వాహనాలు.. నవంబర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి



