త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | కాళేశ్వ‌రం గురించి మాట్లాడితే య‌మ‌ కోప‌మొస్త‌ది మీకు

Chamala Kirankumar Reddy | మేడిగ‌డ్డ కూలిపోయింద‌నే విష‌యం ప్ర‌జ‌ల‌కు, మీకు తెలియ‌దా అని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) హ‌రీశ్‌రావును ప్రశ్నించారు.

S

Telangana | Published On Oct 27, 2026, 12.50 pm IST

Chamala Kirankumar Reddy | కాళేశ్వ‌రం గురించి మాట్లాడితే య‌మ‌ కోప‌మొస్త‌ది మీకు
Advertisement
  • మేడిగ‌డ్డ కూలిపోయింద‌నే ముచ్చ‌ట మీకు తెల్వ‌దా
  • ఎత్తిపోసేదుంటే నువ్ ఎందుకు చేయ‌లే ఆ ప‌ని
  • నీళ్లు కిందికి వెళ్లిపోవ‌డానికి మీరే కార‌ణం
  • హ‌రీశ్ రావుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంట‌ర్‌

Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: మేడిగ‌డ్డ కూలిపోయింద‌నే విష‌యం ప్ర‌జ‌ల‌కు, మీకు తెలియ‌దా అని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) హ‌రీశ్‌రావును ప్రశ్నించారు. కాళేశ్వ‌రం (Kaleshwaram) మీద మాట్లాడితే ఆయ‌న‌కు య‌మ‌ కోపం వ‌స్తుంద‌న్నారు. తాను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలో వాటర్ లెవల్స్ విష‌యంపైనే మాట్లాడానని స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ హ‌రీశ్‌రావు వ్యాఖ్య‌లకు కౌంట‌రిచ్చారు.

హరీశ్‌రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ గురించి మాట్లాడితే కోపం వస్తుంది. మేడిగడ్డ నుంచి 20 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందనే విషయం తెలంగాణ ప్రజలకు, మీకు తెలియదా? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలింది. దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లో పంపులు నడుస్తున్నాయి. మేడిగడ్డ వద్ద గతంలో నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూడా లేదు. ఒక‌వేళ అవ‌కాశం ఉంటే నువ్ ఎందుకు ఎత్తిపోయ‌లే?

హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కాళేశ్వరాన్ని కూళేశ్వరం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన దరిద్రం వల్ల‌నే కాళేశ్వరం కూళేశ్వరం అయింది. గోదావరిలో నీళ్లన్నీ కిందకు వెళ్లిపోవడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణం అని చామ‌ల ఆరోప‌ణ‌లు చేశారు.

Advertisement
Advertisement