Srinidhi Shetty | అమ్మ పాత్ర…అయినా “నో” చెప్పాలని అనిపించలేదు – ఆదర్శకుటుంబంపై శ్రీనిధి శెట్టి కామెంట్స్
'ఆదర్శ కుటుంబం' సినిమాలో తాను ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తానని అన్నది శ్రీనిధి శెట్టి. వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం అసాధ్యమని చెప్పింది. వెంకటేష్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆదర్శ కుటుంబం' మూవీ అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతుంది.
Srinidhi Shetty | 'ఆదర్శ కుటుంబం' సినిమాతోనే కెరీర్‌లో మొదటిసారి కామెడీ పాత్ర చేశానని అన్నది శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). చిట్‌ఫండ్‌లో డబ్బులు పొగొట్టి అప్పులు చేస్తూ భర్తను ఇబ్బంది పెట్టే భార్యగా తన పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పింది. ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతుంది. వెంకటేష్ (Venkatesh )హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదర్శ కుటుంబం రిలీజ్ సందర్భంగా శ్రీనిధి శెట్టి పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి...
కొత్త జానర్...
త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక చాలా రోజుల నుంచి ఉంది. ఆయన నుంచి పిలుపు రావడం సంతోషంగా అనిపించింది. పైగా ఇది త్రివిక్రమ్ , వెంకటేష్ ఇద్దరికి కొత్త జానర్. త్రివిక్రమ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా 'ఆదర్శ కుటుంబం' ఉంటుంది. కథ వినగానే ఖచ్చితంగా భాగం కావాలనిపించింది.
అమ్మ పాత్ర...
ఇందులో నేను ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తా. అమ్మ పాత్ర అయినప్పటికీ, సినిమాకి నో చెబుదామనే ఆలోచన ఒక్క క్షణం కూడా కలగలేదు. ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి. అంతలా ఈ కథ, క్యారెక్టర్ నా మనసును ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ చెప్పినట్లు ఇది క్రైమ్ అంశాలతో సాగే డార్క్ కామెడీ మూవీ. నా కెరీర్‌లో కామెడీ పాత్ర చేయడం ఇదే మొదటిసారి. చిట్‌ఫండ్‌లో డబ్బులు పొగొట్టి అప్పులు చేస్తూ భర్తను ఇబ్బంది పెట్టే ఇల్లాలిగా చాలా ఫన్నీగా నా క్యారెక్టర్‌ను త్రివిక్రమ్ డిజైన్ చేశారు. ఇప్పటిదాకా ఇలాంటి కామెడీ ప్రధాన పాత్రలు చేయకపోవడంతో న్యాయం చేయగలనో లేదో అని మొదట్లో భయపడ్డా. అవుట్ పుట్ చూసుకున్న తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది.
ప్రతి డైలాగ్...
త్రివిక్రమ్ డైలాగ్స్‌లో ఎంతో లోతైనా భావం ఉంటుంది. అందుకే ప్రతి డైలాగ్ నేను చెప్పేముందు దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఈ సినిమాలోనూ ఆయన రైటింగ్ లో మ్యాజిక్ కనిపిస్తుంది. ట్రైలర్ లోని "చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్?" అనే డైలాగ్ అయితే నాకు మాత్రమే కాదు, అందరికీ ఎంతగానో నచ్చింది.
అందుకే గ్యాప్...
కంటెంట్ పరంగా నా మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. ఆదర్శ కుటుంబం ఇలా ఎంపికచేసుకుందే. నేను చాలా తక్కువ సినిమాలు చేస్తున్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ అన్నీ పెద్ద సినిమాలే కావడంతో షూటింగ్‌కే రెండేళ్ల వరకు టైమ్ పడుతోంది. అందుకే నా ప్రతి సినిమా రిలీజ్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటోంది. 'ఆదర్శ కుటుంబం' కూడా 2025 జూలైలో జాయిన్ అయ్యాను. సంవత్సరం దాటి పోయింది.
అసాధ్యం...
వెంకటేష్ అద్భుతమైన నటుడు. కామెడీ టైమింగ్ లోనే కాదు ఎమోషనల్ సీన్లలో ఆయన నటన బాగుంటుంది. వెంకటేష్‌ను మ్యాచ్ చేయడమన్నది అసాధ్యం. కానీ, నా వంతుగా ప్రయత్నించాను. ముఖ్యంగా త్రివిక్రమ్ సూచనలతో కామెడీ సన్నివేశాల్లో సహజంగా నటించడానికి ట్రై చేశాను. ఇటీవలే ఆదర్శ కుటుంబం సినిమాను చూశాను. షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమా చూసినప్పుడు అంతకుమించిన ఆనందం కలిగింది.ఈ సినిమాలో కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తారో, యాక్షన్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైరల్
అక్టోబర్ 26, 2026

Kangana Ranut | కలిసిరాని బాలీవుడ్ – హారర్ మూవీతో టాలీవుడ్లోకి కంగనా రనౌత్ రీఎంట్రీ
అక్టోబర్ 26, 2026

Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో బిగ్‌బాస్ భామ – అప్డేట్పై ఫన్నీకామెంట్స్
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●Madapur | మాదాపూర్‌లో వ్యభిచారం.. ఉజ్బెకిస్థాన్ మహిళలు అరెస్ట్
- ●BSE Share Price | బీఎస్ఈ షేర్లకు బూస్ట్.. రూ.4వేల టార్గెట్ ఇచ్చిన బ్రోకరేజ్..
- ●Revanth Reddy | తుమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లు పరిశీలించండి.. 148పై పునఃపరిశీలిస్తం
- ●Traffic Restrictions | హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 90 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Tirupathi | డిసెంబర్ 4 -6 తేదీల్లో తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల సమావేశం
- ●Fauji | వివాదంలో ప్రభాస్ ఫౌజీ - క్షమాపణ చెప్పాలని సుభాష్ చంద్రబోస్ మునిమనవడు డిమాండ్

Madapur | మాదాపూర్‌లో వ్యభిచారం.. ఉజ్బెకిస్థాన్ మహిళలు అరెస్ట్

BSE Share Price | బీఎస్ఈ షేర్లకు బూస్ట్.. రూ.4వేల టార్గెట్ ఇచ్చిన బ్రోకరేజ్..

Revanth Reddy | తుమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లు పరిశీలించండి.. 148పై పునఃపరిశీలిస్తం

Traffic Restrictions | హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 90 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు



