Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు – బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తం అమ్ముకుంటున్నారంటూ తనపై వస్తోన్న ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. సినిమాల కోసం తాను కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. ఆ సంపాదన తనకు సరిపోతుందని, రక్తం అమ్ముకోవాల్సిన అవసరం లేదని మెగాస్టార్ అన్నారు.
Entertainment | Published On Sep 22, 2026, 1.15 pm IST
Chiranjeevi | తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోగా పేరుతెచ్చుకున్నప్పటికీ తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా యూత్ ఫోర్స్ పేరుతో చిరంజీవి ఇటీవల అభిమానులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో చిరంజీవి మాట్లాడుతూ సేవా దృక్పథంతో తాను బ్లడ్ బ్యాంక్ నెలకొల్పితే రక్తం అమ్ముకుంటున్నాడంటూ ఆరోపణలు చేశారు. సినిమాల చేస్తే నాకు కోట్లలో రెమ్యూనరేషన్ వస్తుంది.ఆ సంపాదన నాకు చాలు. రక్తం అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని కోట్ల ప్యాకెట్లు అంత డబ్బు వస్తుంది. విచక్షణ లేకుండా అలాంటి విమర్శలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. బ్లాడ్ బ్యాంక్ నిర్వహణ కోసం నేను ఎవరి దగ్గర విరాళం తీసుకోలేదు. ఎవరి దగ్గర చేయి చాచలేదు. నా కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నడుపుతున్నాను. ఆ విమర్శలను నేను అస్సలు పట్టించుకోను. అదృష్టాన్ని కాదు...కష్టాన్ని నమ్ముకుంటాను అని అన్నారు.
సమయమే విలువైనది...
నా దృష్టిలో సమయమే అన్నింటికంటే విలువైనది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. కానీ గడిచిపోయిన సమయం తిరిగిరాదు. అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నన్ను అభిమానించడం, ప్రేమించడం కాదు. నేను ఎలా పైకి వచ్చాను...జీవితంలో ఎదగడానికి ఏం ఆచరించాను. నా ఆలోచన విధానం ఏమిటన్నది తెలుసుకోవాలి. యాక్టింగ్ టాలెంట్ ఒక్కటే కాదు... క్రమశిక్షణ , కష్టపడేతత్వమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అని చిరంజీవి చెప్పారు.
ఎక్సర్‌సైజ్ కాదు...
ఇంత యంగ్‌గా ఎలా కనబడుతున్నారు...ఏం వ్యాయామాలు చేస్తారని ఈ మధ్య ఎవరో నన్ను అడిగారు. మీ వయసు వాళ్లంతా ముసలివాళ్లైపోయారని అన్నారు. నేను యంగ్‌గా కనిపించేది ఎక్సర్‌సైజ్, డైట్ వల్ల కాదు. అందరికి కృతజ్ఞతగా ఉంటా. తల్లిదండ్రులు, దైవం, గురువులతో నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికి పట్ల కృతజ్ఞతగా ఉంటా. ఆ మానసిక సంతృప్తి, ప్రశాంతత నాలో ఉత్సాహానికి, యంగ్‌గా కనబడటానికి కారణం అని చిరంజీవి అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
సెప్టెంబర్ 21, 2026

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా – రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
సెప్టెంబర్ 21, 2026

Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం – ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ●Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు



