Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా – మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
చిరంజీవి హీరోగా నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు రిలీజై నేటితో 48 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాతోనే శివశంకరవరప్రసాద్...చిరంజీవిగా మారారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "ఆరోజు చిరంజీవి అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు" అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Entertainment | Published On Sep 22, 2026, 5.04 pm IST
Chiranjeevi | టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1978లో రిలీజైన ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పూర్తిచేసుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శివశంకర వరప్రసాద్...ఈ సినిమాతోనే చిరంజీవిగా మారారు. కే వాసు దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో నర్సయ్య అనే ఆవేశపరుడైన యువకుడి పాత్రలో చిరంజీవి అసమాన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ప్రాణం ఖరీదు విడుదలై నలభై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
48 వసంతాలు...
"22 సెప్టెంబర్ 1978 ...ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు "అని ఈ పోస్ట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
రెమ్యూనరేషన్
ప్రాణం ఖరీదు సినిమాకు గాను చిరంజీవి 1116 రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఆయన అంగీకరించిన మొదటి మూవీ పునాదిరాళ్లు అయినా తొలుత థియేటర్లలో ప్రాణం ఖరీదు రిలీజైంది. ఈ సినిమాలో ఒరియా నటి రేష్మీరాయ్ హీరోయిన్‌గా నటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని – సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా – కయదు లోహర్ కామెంట్స్
సెప్టెంబర్ 22, 2026

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ – 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
సెప్టెంబర్ 22, 2026

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు – బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- ●Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- ●New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!
- ●TG Weather | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!
- ●Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?
- ●TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..

Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!

TG Weather | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!



