Chiranjeevi | మెగా అప్‌డేట్ – చిరంజీవి నెక్స్ట్ మూవీ లాంఛ్ డేట్ ఇదే
మెగా 158 మూవీపై క్రేజీ అప్‌డేట్‌ను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 21న లాంఛ్ కానున్నట్లు వెల్లడించారు. జిమ్‌లో సీరియస్‌గా వర్కవుట్స్ చేస్తోన్న ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు చిరంజీవి.
Entertainment | Published On May 17, 2026, 5.50 pm IST
Chiranjeevi | ఈ సంక్రాంతికి రిలీజైన మన శంకర వరప్రసాద్‌గారుతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ 400 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ బాబీతో మెగాస్టార్ చిరంజీవి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తోన్న 158వ సినిమా ఇది.
మెగా 158...
మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే లాంఛ్ కావాల్సింది. కానీ జననాయగన్ లీక్‌తో పాటు ఇతర అవాంతరాల వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది.
వర్కవుట్స్ వీడియో...
ఎట్టకేలకు మెగా 158 మూవీపై ఓ క్రేజీ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మే 21న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జరుగనున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్‌తో పాటు ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు చిరంజీవి. ఈ వీడియోలో జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ చిరంజీవి కనిపించారు. సినిమాలోని రోల్ కోసమే మెగాస్టార్ కష్టపడుతోన్నట్లుగా తెలుస్తోంది.
మెగా 158 మూవీ రెగ్యులర్ షూటింగ్ మే 25 నుంచి హైదరాబాద్‌లో మొదలుకానుందట. ఫస్ట్ షెడ్యూల్ నుంచే చిరంజీవి చిత్రీకరణలో భాగం కానున్నట్లు టాక్ . ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. చిరంజీవికి జోడీగా ప్రియమణి హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. మరో కీలక పాత్రలో మలయాళ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ కనిపించబోతున్నట్లు సమాచారం. వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో మూవీ ఇది. వాల్తేర్ వీరయ్య కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది.
Every day is another opportunity to push beyond limits…
Charged up and excited for another memorable journey with my dear @dirbobby for #Mega158 🤗
Opening Ceremony on May 21st ✨#ChiruBobby2 @KvnProductions pic.twitter.com/tTuu8YyA9d
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 17, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



