త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ – చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ సిగ్మా మూవీతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సందీప్‌కిష‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా జంట‌గా న‌టించిన ఈ మూవీ అక్టోబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబ‌ర్ 25న హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నారు.

N

Entertainment | Published On Sep 24, 2026, 2.30 pm IST

Chiranjeevi | ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ – చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్‌
Advertisement

Chiranjeevi |  త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ సిగ్మా మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సందీప్ కిష‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త‌మిళంలో రూపొందిన ఈ మూవీ అదే టైటిల్‌తో తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

జాస‌న్ సంజ‌య్ డెబ్యూ మూవీ కావ‌డంతో సిగ్మా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో జాస‌న్ సంజ‌య్‌తో పాటు మూవీ టీమ్ ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా సిగ్మా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక‌తో పాటు గెస్ట్ ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది.

చిరంజీవి...

సెప్టెంబ‌ర్ 25న హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో సిగ్మా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌బోతుంది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు మూవీకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రుకానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవితో పాటు మ‌రికొంద‌రు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కూడా ఈ వేడుక‌లో పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.

కేథ‌రిన్ స్పెష‌ల్ సాంగ్‌....

సిగ్మా మూవీలో కేథ‌రిన్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. సంప‌త్‌, రాజు సుంద‌రం కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.తొలుత జూలైలోనే సిగ్మా మూవీని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ అదే నెల‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి మూవీ జ‌న‌నాయ‌గ‌న్ థియేట‌ర్ల‌లోకి రావ‌డంతో సిగ్మా వాయిదాప‌డింది. అక్టోబ‌ర్ 2న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సిగ్మా మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర‌లో జాస‌న్ సంజ‌య్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement