Mega Victory Song | సంక్రాంతి అదిరిపోద్ది – స్టెప్పులతో ఇరగదీసిన చిరు, వెంకీ – మెగా విక్టరీ సాంగ్ రిలీజ్
సంక్రాంతి సంబరాలను ఇరవై రోజుల ముందుగానే అభిమానుల ముందుకు తీసుకొచ్చారు మన శంకర వరప్రసాద్‌గారు మేకర్స్. ఈ సినిమా నుంచి మెగా విక్టరీ సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పాటలో చిరంజీవి, వెంకటేష్ స్టెప్పులతో అదరగొట్టారు.
Entertainment | Published On Dec 30, 2025, 5.54 pm IST
Mega Victory Song | టాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది అభిమానులు చిరకాల కల. మన శంకర వరప్రసాద్ గారుతో మెగా, విక్టరీ ఫ్యాన్స్ కలను నిజం చేయబోతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా సంక్రాంతి సంబరాలను ఓ ఇరవై రోజుల ముందుగానే అందించారు మేకర్స్. మన శంకర వరప్రసాద్ గారు నుంచి మెగా విక్టరీ సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. చిరంజీవి, వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మెగా విక్టరీ సాంగ్ లిరిక్స్ సాగాయి. ఈ పాటలో ఇద్దరు హీరోలు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. పోటీపడి డ్యాన్స్ చేశారు. మెగా విక్టరీ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్, విశాల్ దద్లానీ ఈ పాటను ఆలపించారు. భీమ్స్ మ్యూజిక్ ఆలపించారు. "నువ్వు నేనే వేరే లెవెల్.... ఇద్దరి కాంబో పీక్స్ లెవెల్....ఏంటి బాసు సంగతి అదిరిపొద్ది సంక్రాంతి...ఏంటి వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి" అంటూ సాగిన లిరిక్స్ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నాయి. మెగా విక్టరీ సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
బెస్ట్ లుక్...
ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి పాల్గొన్నారు."ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మన శంకర వర ప్రసాద్ గారు మూవీని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గి స్లిమ్‌గా మారారు. ఆయన బెస్ట్ లుక్‌ను ఇందులో చూస్తారు. ఈ సంక్రాంతి మెమోరబుల్‌గా ఉంటుంది. చిరంజీవి, వెంకటేష్ స్టెప్పులు, యాక్టింగ్, చాలా రోజులు గుర్తుండిపోతాయి" సాంగ్ లాంఛ్ వేడుకలో అనిల్ రావిపూడి చెప్పారు.
మన శంకర వరప్రసాద్‌గారులో వెంకటేష్ ది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. సెకండాఫ్‌లో ఇరవై నిమిషాల పాటు ఆయన క్యారెక్టర్ అభిమానులకు కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా నుంచి మీసాల పిల్లాతో పాటు శశిరేఖ పాటలు రిలీజ్ చేశారు. త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
మన శంకర వరప్రసాద్‌గారులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. కేథరిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



